Reading Time: < 1 minute

పార్టీ లైన్ దాటితే ఎవరిపై అయినా చర్యలుంటాయి: మల్లు రవి

Caption of Image.

చిన్నారెడ్డి, మేఘారెడ్డి ఇష్యూపై కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ భేటీ అయ్యింది. శనివారం ( ఆగస్టు 22 ) గాంధీ భవన్ లో జరిగిన భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ మల్లు రవి. పార్టీ లైన్ దాటితే ఎవరిపై అయినా చర్యలు ఉంటాయని అన్నారు. ఫిర్యాదులు క్షుణ్ణంగా పరిశీలించామని… ఈరోజే నిర్ణయాలు తీసుకోలేమని అన్నారు మల్లు రవి.

మరోసారి క్రమశిక్షణ కమిటీ భేటీ ఉంటుందని తెలిపారు. మూడు అంశాలపై ఇవాళ చర్చ జరిగిందని.. చిన్నారెడ్డి వివరణపై కూడా చర్చ జరిగిందని అన్నారు. సుస్మిత మాట్లాడిన వీడియోలు చూశామని.. కొండా సురేఖ రిప్లై కూడా చర్చకు వచ్చిందని అన్నారు. కొండా సురేఖ వివరణపై మరోసారి భేటీ ఉంటుందని… చిన్నారెడ్డి ఇష్యూపై మేఘారెడ్డితో మాట్లాడతామని అన్నారు మల్లు రవి.

ఇదిలా ఉండగా…తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీకి లేఖ రాశారు మాజీ  మంత్రి చిన్నారెడ్డి. తాను ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని.. తప్పుగా మాట్లాడలేదని లేఖలో పేర్కొన్నారు చిన్నారెడ్డి. 1978 నుండి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నానని, పార్టీ కి బద్ధునిగా పని చేస్తున్నానని అన్నారు.

తాను ఏ రోజు పార్టీ కి వెతిరేకంగా మాట్లాడలేదని.. ఇందిరభవన్ , గాంధీ భవన్ లను దేవాలయంలా బావిస్తానని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే  వ్యవహారం ఒంటెద్దుపోకడలా ఉందని అన్నారు.

తనకు ఇచ్చిన నోటీసు ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు చిన్నారెడ్డి. తన వివరణను పరిగణనలోకి తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీకి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ పట్ల తన విధేయతపై ఎలాంటి సందేహాలు వద్దని… పార్టీ కార్యకర్తల మనోభావాలకే తాను వాణిగా నిలిచానని లేఖలో పేర్కొన్నారు చిన్నారెడ్డి.

©️ VIL Media Pvt Ltd.