Reading Time: < 1 minute
Hyderabad: తెలంగాణలో భూములకు రికార్డు ధర.. ఎకరం రూ.264 కోట్లు.. ఎవరు కొన్నారో తెలుసా?

Hyderabad: తెలంగాణలో భూముల ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. హైదరాబాద్‌లోని రాయయదుర్గంలో ఎకరం భూము ధర వింటే మీరే షాకవుతారు. అక్షరాల 264 కోట్ల రూపాయలు. టీజీఐఐసీ భూముల వేలానికి భారీ స్పందన లభించింది. టీజీ ఐఐసీలో ఎకరం భూమి ఇంత ధర పలకడం రికార్డు అనే చెప్పాలి.

అయితే హైదరాబాద్‌ నగరంలోని అత్యంత ఖరీదైన ఐటీ కారిడార్ అయిన రాయదుర్గం పరిధిలోని ప్లాట్ నంబర్ P1కి సంబంధించి వేలం నిర్వహించారు. ఎకరం భూమి రికార్డు స్థాయిలో ధర పలుకుతుండటం ధరలు ఏ రేంజ్‌లో వెళ్తున్నాయో అర్థమైపోతుంది. ఈ ప్లాట్‌ విస్తీర్ణం మొత్తం 5.25 ఎకరాలు ఉండగా, ఎకరాకు రూ. 264 కోట్ల చొప్పున లెక్కగడితే ఈ స్థలం మొత్తం విలువ రూ. 1,386 కోట్లకు చేరింది.

ఈ భూమిని ఎవరు కొన్నారో తెలుసా..?

ఎకరం భూమి ఇంత ధర పలుకడం, దీనిని ఎవరు కొన్నారనేదానిపై చర్చనీయాంశమైంది. రంగారెడ్డి జిల్లా రాయదుర్గం ప్రాంతంలో ఉన్న ఈ అత్యంత విలువైన స్థలాన్ని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘MSN రియాల్టీస్’ పోటీపడి వేలంలో దక్కించుకుంది. నగరంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఎంత డిమాండ్‌ ఉందో తెలిసిపోతుంది.