
Irumudi Day 1 Collections: మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫాదర్ డాటర్ ఎమోషనల్ బాండింగ్‌తో పాటు రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ అంశాలను కలిపి రూపొందించిన ఈ సినిమా తొలి రోజే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ట్రేడ్ వర్గాల ప్రకారం.. భారత్‌లో మొదటి రోజు రూ.14.80 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, ప్రపంచవ్యాప్తంగా రూ.24.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రవితేజకు ఉన్న క్రేజ్ ఈ ఓపెనింగ్స్‌లో స్పష్టంగా కనిపించింది. ఈ యాక్షన్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. తాగుడుకు బానిసైన ఒక తండ్రి, తన కూతురి కోరిక మేరకు అయ్యప్ప దీక్ష తీసుకున్న తర్వాత అతని జీవితంలో వచ్చిన మార్పులు, ఎదుర్కొన్న సవాళ్ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రవితేజ తన రెగ్యులర్ మాస్ ఇమేజ్‌ను పక్కన పెట్టి చేసిన ఈ తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ సినిమాకు హైలైట్ గా నిలిచి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదే జోరు కొనసాగిస్తే ఈ మూవీ 100కోట్ల క్లబ్ లోకి చేరడం మరెంతో దూరం లేనట్లు అనిపిస్తోంది. శని, ఆది వారాలలో కలెక్షన్స్ కూడా ఇంకా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది గనుక ఈ సినిమా రవితేజ కెరీర్ లో కలెక్షన్ల సునామిని సృష్టించేలా కనిపిస్తోంది.
ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ వార్త కూడా చక్కర్లు కొడుతోంది. ‘ఇరుముడి’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ.14 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఆఫీషియల్ అనౌన్స్ రాలేదు. ఒకవేళ ఈ సమాచారం నిజమైతే.. థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ‘ఇరుముడి’ ఓటీటీ వెర్షన్ కూడా పలు భాషల్లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. దీంతో థియేటర్లలో తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లోని రవితేజ అభిమానులకు కూడా ఈ సినిమాను డిజిటల్‌గా చూసే అవకాశం లభించనుంది. అయితే ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం థియేటర్లలో మాస్ మాస్ మహారాజా రవితేజ యాక్టింగ్ ను చూసేందుకుకు క్యూ కడుతున్నారు. చాలా రోజుల తరువాత డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నందున ఈ సినిమాకి మంచి బజ్ ఏర్పడింది. మరి ఈ మూవీ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.