
ESIC Jobs: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు వాక్ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
మొత్తం ఖాళీలు: 67. ( ప్రొఫెసర్ 12, అసోసియేట్ ప్రొఫెసర్ 19, అసిస్టెంట్ ప్రొఫెసర్ 20, సీనియర్ రెసిడెంట్ 16)
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/ ఎండీ/ డీఎన్బీ (పీఎంఆర్), డీఎం/ డీఎన్బీ/ డాక్టర్ఎన్బీ (క్రిటికల్ కేర్) పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: ఫ్యాకల్టీ పోస్టులకు 69 ఏళ్లు, సీనియర్ రెసిడెంట్ పోస్టులకు 45 ఏళ్లు.
ALSO READ : ఈపీఎఫ్ఓలో ఏపీఎఫ్సీ పోస్టులు
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మన్, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు ఉండదు. ఇతరులు రూ. 500 చెల్లించాలి.
వాక్ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: ఆగస్టు 21 నుంచి 31 వరకు.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ esic.gov.inను సందర్శించండి.