Reading Time: 2 minutes
Chicken Prices: మాసం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధర.. ఎంతో తెలిస్తే ఎగబడి కొంటారు..!

Chicken Prices Drop: ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చికెన్‌ ధరలు భగ్గుమన్నాయి. కానీ గత కొన్ని రోజులుగా క్రమంగా దిగి వస్తున్నాయి. ఈ శ్రావణ మాసంలో చాలా మంది పూజలు, వ్రతాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల కారణంగా పలువురు మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీంతో చికెన్కు డిమాండ్ తగ్గి.. రిటైల్ మార్కెట్లో ధరలు దిగివచ్చాయి. ముఖ్యంగా వారాంతాల్లో కూడా కొనుగోళ్లు తగ్గడం ధరలపై మరింత ప్రభావం చూపుతోంది.

డిమాండ్ తగ్గినా కోళ్ల సరఫరా కొనసాగుతుండటంతో మార్కెట్లో ధరలపై ఒత్తిడి ఏర్పడుతోంది. ఫీడ్ ధరలు, రవాణా ఖర్చులు, ఉత్పత్తి వ్యయం వంటి అంశాలతోపాటు ప్రస్తుతం డిమాండ్ సరఫరా సమతుల్యత కూడా చికెన్ ధరలను ప్రభావితం చేస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్ మరింత తగ్గితే ధరలు మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Ceiling Fan: కరెంట్ పోయినా ఫ్యాన్ ఆగదు.. హైబ్రిడ్ సీలింగ్ ఫ్యాన్ గురించి మీకు తెలుసా? ధర ఎంతంటే..

శ్రావణ మాసం ముగిసిన తర్వాత మాంసాహార వినియోగం సాధారణ స్థాయికి చేరితే చికెన్కు డిమాండ్ మళ్లీ పెరిగే అవకాశం ఉంది. దీంతో ధరలు కూడా తిరిగి పుంజుకునే అవకాశముందని పౌల్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ధరలు భారీగా తగ్గడం చికెన్‌ ప్రియులకు కొంత ఊరటనిచ్చాయనే చెప్పాలి.

ప్రస్తుతం శ్రావన మాసం కారణంగా చికెన్‌తో పాటు గుడ్ల ధరలు కూడా భారీగానే దిగి వస్తున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్‌తోపాటు పలు ప్రాంతాల్లో నెల ప్రారంభంలో కిలో చికెన్‌ ధర రూ.320-350 వరకు పలుకగా, ఒక దశలో కిలో 400 రూపాయలకు కూడా వెళ్లింది. ప్రస్తుతం రూ.200కి దిగొచ్చినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో అయితే కిలో చికెన్‌ ధర రూ.230 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు.

భారీగా పడిపోయిన గుడ్ల ధరలు

ఇక చికెన్‌ తగ్డంతో పాటు గుడ్డు ధర కూడా భారీగా పడిపోయింది. ఒక గుడ్డ ధర 5 రూపాయలు విక్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో 6 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఏదీ ఏమైన చికెన్‌తో పాటు గుడ్డు ధర పడిపోవడం కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Hyderabad: తెలంగాణలో భూములకు రికార్డు ధర.. ఎకరం రూ.264 కోట్లు

ఇది కూడా చదవండి: House Construction: 150 గజాల ఇంటి నిర్మాణానికి 12 పిల్లర్ల ఖర్చు ఎంతో తెలుసా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి