Reading Time: < 1 minute

సహజీవనం పెళ్లితో సమానం.. అడ్డుకునే హక్కు తల్లిదండ్రులకు లేదు.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

Caption of Image.

సహజీవనంపై సంచలన తీర్పు వెల్లడించింది ఢిల్లీ హైకోర్టు. ఇద్దరు మేజర్లు సహజీవనం సాగిస్తుంటే జోక్యం చేసుకునే హక్కు తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు లేదని తీర్పు వెల్లడించింది ఢిల్లీ హైకోర్టు. లివిన్ లో ఉండే జంటకు పోలీసుల రక్షణ కూడా ఉంటుందని తెలిపింది కోర్టు. మేజర్లకు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని గుర్తు చేసింది ఢిల్లీ హైకోర్టు.

పరస్పర అంగీకారంతో సహజీవనం చేయడం వివాహంతో సమానమని, ఈ విషయంలో తల్లిదండ్రులు గానీ, స్నేహితులు గానీ జోక్యం చేసుకోలేరని పేర్కొంది కోర్టు.యువతి కుటుంబం నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న జస్టిస్ సౌరభ్ బెనర్జీ కేసు విచారణ సందర్భంగా ఈ మేరకు సంచలన తీర్పు వెల్లడించింది కోర్టు. జస్టిస్ సౌరభ్ బెనర్జీ జంటకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించింది కోర్టు.

సామజిక నైతిక విలువల పేరుతో కానీ, కులం, మతం, జాతి, విశ్వాసంతో సంబంధం లేకుండా వివాహాలను గుర్తించాలని.. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను సామాజిక నైతిక విలువలకు పరిమితం చేయడం అనేది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని పేర్కొంది కోర్టు.

©️ VIL Media Pvt Ltd.