
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లాపూర్‌లోని సుమంత్ నివాసం ఎదుట డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
పోలీసుల సమాచారం ప్రకారం, ఓ వ్యాపారిని రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేశారనే ఆరోపణలపై సుమంత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు, కేసులో భాగంగా డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సుమంత్ కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.