Reading Time: 2 minutes

వ్యూస్, లైక్స్ నాకు అక్కర్లేదు.. నేను మాత్రం నా పని చేసుకుంటా: గంభీర్

Caption of Image.

Gautam Gambhir: వరుస ఓటములు, సోషల్ మీడియా ట్రోల్స్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ మీట్‌లో ప్రదర్శించిన మార్క్ ఆటిట్యూడ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. శ్రీలంకతో రెండో టెస్టుకు ముందు మాట్లాడిన గౌతీ.. టీమిండియా టెస్టుల్లో దారుణంగా తడబడుతోందన్న వార్తలను స్వీట్ గా కొట్టిపారేశాడు. మేం స్ట్రగుల్ అవ్వట్లేదు నాయనా.. ట్రాన్సిషన్ ఫేజ్ (మార్పు దశ)లో ఉన్నాం అంటూ విమర్శకులకు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చేశాడు. 

ఫెయిలైతే ట్రాన్సిషన్.. గెలిస్తే నా మాస్టర్‌ప్లాన్ : 

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజాలు ఒకేసారి టెస్టులకు టాటా చెప్పేయడంతో టీమ్ కష్టాల్లో పడిందన్నది నిజం. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాల చేతిలో సిరీస్‌లు ఊడిపోయినా గంభీర్ మాత్రం డోంట్ కేర్ అన్నాడు. క్రికెట్‌లో గెలుపోటములు సహజం భయ్యా.. ఇంగ్లాండ్ టూర్ నుంచి మేం చాలా ప్రశాంతంగా, రీజనబుల్ క్రికెట్ ఆడాం.. ఇప్పుడు శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో కొత్త కుర్రాళ్లతో టీమ్‌ను సెట్ చేస్తున్నామని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు.

నాకు మీమ్స్, వ్యూస్ అక్కర్లేదు బాబోయ్:  

ఇక తనపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, నెటిజన్ల అభిప్రాయాలపై మాట్లాడిన గౌతమ్ గంభీర్ మండిపడ్డాడు. నా జాబ్ ట్రోఫీలు గెలవడం, అంతేగానీ సోషల్ మీడియాలో నా గురించి వచ్చే వ్యూస్, లైక్స్ చూసి మురిసిపోవడం కాదు.. ఇతరులకు, నాకు ఉన్న తేడా అదే.. నాకు బయటి నుంచి వచ్చే లైకులు, వ్యూస్‌తో పనిలేదు.. ఐసీసీ ర్యాంకింగ్స్ కూడా నాకు ఒక లెక్కే కాదంటూ సీరియస్ గా చెప్పుకొచ్చాడు. 

కనీసం 3 టెస్టులు పెట్టండి: గంభీర్ 

రెండు టెస్టుల సిరీస్‌లపై గంభీర్ మాట్లాడుతూ.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటిది ఓడిపోతే ఇక దారే లేదు.. ఎక్కువ సిరీస్ సమం (Draw) మాత్రమే చేయగలం.. అందుకే కనీసం 3 టెస్టుల సిరీస్ ఉంటే మాలాంటి టీమ్‌లు ఓడిపోయినా మళ్లీ కంబ్యాక్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందని ఓ సలహా ఇచ్చాడు. ఇక కుల్దీప్ యాదవ్ ఫార్మ్, డ్రాప్ వార్తలపై స్పందిస్తూ.. ఒకట్రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయితే వెంటనే జట్టు నుంచి తీసేయమని, ప్లేయర్లకు మరింత ఎక్కువ అవకాశాలు ఇస్తామని స్పష్టం చేశాడు. 

©️ VIL Media Pvt Ltd.