Reading Time: < 1 minute

నాన్న నిన్ను చూసి నిజంగా గర్వపడతారు: రాహుల్ గాంధీ ఎమోషనల్ పోస్ట్

Caption of Image.

సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ బుక్ విడుదల సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ. రాహుల్ తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ షేర్ చేశారు రాహుల్.నేను నిన్ను, నాన్నను చివరిసారిగా కలిసి చూసి 35 ఏళ్లకు పైగా అయ్యిందని… నాన్న వెళ్ళిపోయినప్పటి నుండి, జీవితం నీ ముందు ఉంచిన సవాళ్లన్నింటినీ నువ్వు అంతులేని ధైర్యంతో, హుందాతనంతో ఎదుర్కోవడం నేను చూస్తూనే ఉన్నానని అన్నారు రాహుల్ గాంధీ.

నువ్వు ఎలాంటి పరిస్థితులను దాటుకుని వచ్చావో, నాన్న తర్వాత నీ జీవితం ఎంత కష్టంగా గడిచిందో కేవలం ప్రియాంకకు, నాకు మాత్రమే నిజంగా తెలుసు. నిన్ను ప్రేమించే లక్షలాది మంది ప్రజలు చివరకు నీ కథను – “Belonging: A Journey of Love” – ​​చదవబోతున్నారన్న విషయం నాకు ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని కలిగిస్తోందని అన్నారు రాహుల్ గాంధీ. 

వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడని నువ్వు, నీ అందమైన కథను ప్రపంచానికి చెప్పడం ఎంత కష్టమైన పనో నాకు తెలుసు.ఈ రోజు, ఆయన పుట్టినరోజున, నాన్న తన అందమైన సోనియా వైపు చూస్తూ గర్వంగా చిరునవ్వు చిందించడం నాకు కనిపిస్తోంది.

©️ VIL Media Pvt Ltd.