
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. జూలై 23, 2026న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. విజయ్ చివరి చిత్రం కావడంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై అభిమానుల్లో మొదటి నుంచే ఆసక్తి నెలకొంది.
ఓటీటీలోకి ‘జననాయగన్’..
‘జననాయగన్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే నేటి నుంచి సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది. ఒరిజినల్ తమిళ వెర్షన్‌తో పాటు తెలుగు డబ్బింగ్ సహా పలు భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. ప్రస్తుతం జీ5 టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. థియేటర్లలో సినిమా చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఫుల్ ఎంటర్ టైన్ అవుతున్నారు. విజయ్-పూజా హెగ్డే జోడీని ఎంజాయ్ చేస్తున్నారు. విశ్వనాధ్ & సన్స్ తో మరో హిట్ అందుకున్న మమితా బైజు నటనకు ఫిదా అవుతున్నారు.
The roar continues! Jana Nayagan is #1 Trending on Zee 5❤️🔥#Jananayagan is Streaming Now on Zee 5
The Hon’ble Chief Minister @actorvijay @TheKVNofficial @KvnProductions #HVinoth @hegdepooja @anirudhofficial @thedeol @_mamithabaiju @Jagadishbliss @LohithNK01 @RamVJ2412 @TSeries… pic.twitter.com/uTGMZcUS0I
— Zee 5 Tamil (@ZEE5Tamil) August 21, 2026
బాక్సాఫీస్ వద్ద మిక్సెడ్ టాక్..
భారీ అంచనాల మధ్య విడుదలైన ‘జననాయగన్’ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. పైరసీ లీకులు సినిమాకు ప్రతికూలంగా మారడంతో పాటు.. ఈ చిత్రం ‘భగవంత్ కేసరి’ రీమేక్ అనే ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో సినిమాపై ఆసక్తిని కొంత తగ్గించింది. దీంతో తెలుగు మార్కెట్‌లో కలెక్షన్లపై ప్రభావం పడింది.
ALSO READ : ఇండియన్ మగాళ్లు వేస్ట్? యూరోపియన్ మెన్స్ బెస్ట్…
అయితే తమిళనాడులో విజయ్‌కు ఉన్న భారీ క్రేజ్ సినిమాకు కలిసొచ్చింది. అక్కడ మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.321 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. విజయ్ కెరీర్‌లో చివరి చిత్రంగా ‘జననాయగన్’ అభిమానులకు మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోయింది.