Reading Time: < 1 minute

పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఆందోళన చెందొద్దు..! పాత విధానంలో ఎలాంటి మార్పులు ఉండవు: మంత్రి వివేక్ వెంకటస్వామి

Caption of Image.

పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఆందోళన చెందొద్దని.. పాత విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. శుక్రవారం ( ఆగస్టు 21 ) సెక్రటేరియట్ లో మీడియాతో ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇవాళ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ తో మాట్లాడానని… పాలిటెక్నిక్ పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వివరించానని అన్నారు. రూ. 6వందల కోట్లతో పాలిటెక్నిక్ లను అభివృద్ధి చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.

ప్రభుత్వం పాలిటెక్నిక్ ల అభివృద్ధికి కృషి చేస్తోంటే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని…పాత విధానం లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు మంత్రి వివేక్. యధావిధిగా అన్ని అమలు చేస్తామని.. లెక్చరర్స్ తో చర్చించలేదు అనేది అవాస్తవమని అన్నారు.

లెక్షరర్స్ కు ఎలాంటి నష్టం ఉండదని.. దీనికి సంబంధించిన జీవో విడుదల చేస్తామని అన్నారు. ఇవాళ్ళ విద్యార్థులతో మాట్లాడినప్పుడు రెండు మూడు అంశాలు లేవనెత్తారని అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్  ఇస్తామని.. శక్తి అనేది కూడా ప్రభుత్వ సంస్థనే అని అన్నారు. 

పాలిటెక్నిక్స్ అంశాన్ని రాజకీయంగా మారుస్తున్నారని.. ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక పోతున్నారని అన్నారు.   విద్యార్థులకు నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం పై ఉందని.. విద్యార్థులు, అధ్యాపకులు ప్రభుత్వ విధానాలను అర్థం చేసుకోవాలని కోరారు మంత్రి వివేక్.
 

©️ VIL Media Pvt Ltd.