
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు : మహబూబ్ నగర్ ప్రజల ప్రస్తుత, భవిష్యత్తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రూ.220 కోట్లతో అదనంగా 18 మిలియన్ లీటర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న 20 మిలియన్ లీటర్ల సామర్థ్యం పెరుగుతున్న అవసరాలకు సరిపోకపోవడం, పైప్‌లైన్ లీకేజీలు, పంపింగ్ సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలను అధిగమించేందుకు ఈ కొత్త రిజర్వాయర్లు, ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్లను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే కొన్ని ఓహెచ్ఎస్ఆర్ లకు శంకుస్థాపన చేయగా, తాజాగా శుక్రవారం మౌలాలిగుట్ట, మెట్టుగడ్డ, టీచర్స్ కాలనీ ప్రాంతాల్లో మరో మూడు కొత్త ట్యాంకుల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రె పాల్గొన్నారు.