సింహ రాశి : సింహ రాశి వారు చాలా సౌమ్యంగా ఉంటారు. గత కొన్ని రోజుల నుంచి వేధించిన మానసిక సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా కూడా బాగుంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ అదే మీకు అత్యధిక లాభాలను తీసుకొస్తుంది. ఆరోగ్యం పరంగా మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు.
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి వ్యాపార పరంగా కలిసి వస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలను పొందుతారు. ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. చాలా ఆనందంగా జీవిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.
వృషభ రాశి : వృషభ రాశి వారికి గ్రహాల కదలికల కారణంగా డబ్బుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు అవ్వవు. ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. అప్పుల బాధల నుంచి బయటపడతారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నివిధాలుగా చాలా బాగుంటుంది. చేతినిండా డబ్బుతో హాయిగా జీవిస్తారు.
కన్యా రాశి : కన్యారాశి వారికి ఈ నెల లక్కీ మాసంగా చెప్పాలి. ఈ సమయంలో ఈ రాశి వారు ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తారు. అంతే కాకుండా గత కొంత కాలం నుంచి రాకుండా ఆగిపోయిన డబ్బులు ఇప్పుడు తిరిగి చేతికి అందుతాయి. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




