Reading Time: 3 minutes

ఈసెట్ యథాతథం .. బీటెక్‌‌‌‌‌‌‌‌లోనూ చేరొచ్చు … పాలిటెక్నిక్ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా

Caption of Image.
  • ఈసెట్ యథాతథం
  • బీటెక్‌‌‌‌‌‌‌‌లోనూ చేరొచ్చు 
  • పాలిటెక్నిక్ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా
  • ల్యాటరల్ ఎంట్రీతో సెకండియర్ ప్రవేశాలు ఉంటాయ్
  • లెక్చరర్ల సర్వీస్ రూల్స్, ప్రమోషన్లకు ఇబ్బంది ఉండదు
  • స్కిల్ వర్సిటీ పరిధిలోకి కాలేజీలు వస్తే ప్రాబ్లమ్స్ రావు
  • ఉపాధి అవకాశాల విస్తరణే లక్ష్యంగా పరిశ్రమలతో లింక్
  • ఫీజుల్లో మార్పు ఉండదు.. ప్రతి నెలా రూ.2 వేల స్టైపెండ్ 
  • తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని మంత్రి వివేక్​ విజ్ఞప్తి
  • అంతకు ముందు జేఏసీ ప్రతినిధులతో సమావేశం

హైదరాబాద్, వెలుగు:  పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ వర్సిటీకి అనుసంధానించడం, శక్తి విభాగం పరిధిలోకి తేవడం వల్ల విద్యార్థులకు, లెక్చరర్లకు ఎలాంటి నష్టం జరగదని రాష్ట్ర కార్మిక, నైపుణ్యాభివృద్ధి (శక్తి) శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు. ‘పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇంజినీరింగ్ సెకండియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి నేరుగా ప్రవేశం కల్పించే ఈసెట్ పరీక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయబోం.. ల్యాటరల్ ఎంట్రీ విధానం యథావిధిగా కొనసాగుతుంది.. అలాగే ఫీజులు పెంచే ప్రసక్తే లేదు.. పైగా విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రతి నెలా రూ.2 వేల చొప్పున స్టైపెండ్ అందించే చారిత్రక నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు’’ అని మంత్రి స్పష్టం చేశారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన విధివిధానాలను అమల్లోకి తెస్తామని చెప్పారు. పాలిటెక్నిక్ చదువుతున్న నిరుపేద, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా మారుతుందన్నారు.

పాలిటెక్నిక్ విద్యార్థుల స్కిల్స్ పెంచడం ద్వారా వారి భవిష్యత్‌‌‌‌‌‌‌‌కు భరోసా కల్పించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఈ విషయంలో పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకులు ఎలాంటి అపోహలు, ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. పాలిటెక్నిక్‌‌‌‌‌‌‌‌ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి జేఏసీ చైర్మన్ నాగరాజు, కన్వీనర్ సురేశ్ తదితరులతో గురువారం సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌లో మంత్రి వివేక్ వెంకటస్వామి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు ప్రభుత్వ నిర్ణయంపై తమ అభిప్రాయాలు, సందేహాలు, ఆందోళనలను మంత్రికి వివరించారు. ఈ చర్చల్లో విద్యాశాఖ కమిషనర్ దేవసేన, శక్తి శాఖ కార్యదర్శి హరిచందన, కార్మిక, ఉపాధి కల్పన శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. 

మారుతున్న సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమల అవసరాలకు తగిన నైపుణ్యాలను విద్యార్థులకు నేర్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి వివేక్ వివరించారు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో వైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాలర్ ఉద్యోగాల సంఖ్య తగ్గుముఖం పడుతోందని, గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 30 వేలు, అమెజాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 40 వేల మంది వరకు ఉద్యోగాలు కోల్పోవడాన్ని చూస్తున్నామని తెలిపారు. ఈ తరుణంలో నైపుణ్యంతో కూడిన సాంకేతిక (బ్లూ కాలర్) ఉద్యోగాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడిందన్నారు. ఇటీవలి ‘ఇండియా రైజింగ్ సమ్మిట్’లో రాష్ట్రానికి రూ.5.70 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు వచ్చాయని, ఆయా పారిశ్రామిక వేత్తలంతా తమకు స్కిల్డ్ మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పవర్ కావాలని కోరారని మంత్రి గుర్తుచేశారు. అందుకే లేబర్ విభాగాన్ని శక్తి (స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్) డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చి, పాలిటెక్నిక్ విద్యార్థులను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికతో ముందడుగు వేస్తున్నామని ఆయన వివరించారు. 

సర్వీస్ నిబంధనల్లో ఎలాంటి మార్పు ఉండదు.. 

పాలిటెక్నిక్ కాలేజీల్లోని అధ్యాపకులు, ప్రభుత్వ టీచర్ల సర్వీసు నిబంధనలపై వస్తున్న ప్రచారాల్లో ఎలాంటి వాస్తవం లేదని మంత్రి వివేక్ వెంకటస్వామి తేల్చిచెప్పారు. ప్రభుత్వ లెక్చరర్ల సర్వీస్ ప్రొటెక్షన్ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నూటికి నూరు శాతం కాపాడుతామని, వారు ప్రభుత్వ ఉద్యోగులుగానే పూర్తి భద్రతతో ఉంటారని హామీ ఇచ్చారు. గతంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగం పరిధిలో ఉన్న వ్యవస్థ.. ఇప్పుడు కేవలం శక్తి విభాగం కిందికి వస్తుందని, అంతకుమించి వారి జీతభత్యాలు, పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో ఎలాంటి కోత ఉండబోదన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాలిటెక్నిక్ లెక్చరర్లకు భవిష్యత్తులో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందేందుకు అదనపు అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఇప్పటికే మాట్లాడామని, ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో ఉండాలని, ఎవరూ భయాందోళనలకు గురికావద్దన్నారు. 

పదేండ్లలో పైసా ఖర్చు చేయలే…

గత పదేండ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పాలనలో పాలిటెక్నిక్ కాలేజీల అభివృద్ధికి పైసా ఖర్చు చేయలేదని, మౌలిక వసతులు లేక వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో ఆధునీకరించేందుకు భారీగా నిధులను సమకూరుస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 120 అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీల)ను నెలకొల్పి ఆధునిక ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, పరిశ్రమల ఆధారిత శిక్షణను అందిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ‘పీఎం సేతు’ పథకం కింద దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రానికి నాలుగు క్లస్టర్లు దక్కాయని, దీని ద్వారా రూ.200 కోట్ల కేంద్ర నిధులు, పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధి రంగంలో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు పటిష్ట చర్యలు చేపడుతుంటే, దీనిపై కొందరు విష ప్రచారం చేయడం దారుణమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

తప్పుదోవ పట్టిస్తున్నరు..

రాజకీయ ప్రయోజనాల కోసమే కొన్ని పార్టీలు, విద్యార్థి సంఘాల నేతలు కావాలని విద్యార్థులను, లెక్చరర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి వివేక్ మండిపడ్డారు. అలాంటి వాళ్ల మాటలు విని స్టూడెంట్లు, లెక్చరర్లు ఆందోళన బాట పట్టవద్దని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తాను ఇటీవలే జర్మనీ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ దాదాపు 5 లక్షల మంది స్కిల్డ్ వర్కర్ల అవసరం ఉందని అక్కడి పరిశ్రమలు పేర్కొన్నాయని, అలాంటి అంతర్జాతీయ అవకాశాలను మన తెలంగాణ బిడ్డలకు అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. స్కిల్ వర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చి మన విద్యార్థులకు ప్రపంచస్థాయి సర్టిఫికేషన్లు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను పక్కనపెట్టి, విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం ఈ విప్లవాత్మక శిక్షణ, ఉన్నత విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. 

భారీగా నిధులు వస్తయ్..​

 సాంకేతిక విద్యామండలి యథావిధిగా తన విధులను నిర్వర్తిస్తుందని, పాలిటెక్నిక్ కాలేజీలను శక్తి విభాగం పరిధిలోకి తేవడంతో కార్మిక శాఖ నుంచి భారీగా నిధులు సమకూరి వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని మంత్రి వివేక్ తెలిపారు. ప్రస్తుతం వివిధ విభాగాల్లో డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సేవలందిస్తున్న ప్రభుత్వ లెక్చరర్ల సర్వీసులకు ఎలాంటి ఆటంకం కలగదని, వారి డిప్యూటేషన్లు, సర్వీస్ రక్షణ నిబంధనలు గతంలో మాదిరిగానే నిరాటంకంగా కొనసాగుతాయని స్పష్టమైన హామీ ఇచ్చారు.  

 విద్యార్థులెవరూ భయపడొద్దు

విద్యార్థులకు స్కిల్ నేర్పించేందుకే పాలిటెక్నిక్ కోర్సులను శక్తి డిపార్ట్​మెంట్​తో అనుసంధానం చేశాం. ఉద్యోగావకాశాలు ఎక్కువుంటాయనే శక్తి పరిధిలోకి మార్చుతున్నాం. పాలిటెక్నిక్​ను అప్ గ్రేడ్ చేయాల్సి ఉంది. స్కిల్ ఉన్న కోర్సులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాలన్నది ప్రభుత్వ ఆలోచన. ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్ల సర్వీస్ కండీషన్లు మారవు. ప్రమోషన్లు, బదిలీలు ఎప్పటిలాగే ఉంటాయి. వారు ప్రభుత్వ ఉద్యోగులుగానే కొనసాగుతారు.  విద్యార్థులు, లెక్చరర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– మంత్రి వివేక్ వెంకటస్వామి 

వర్సిటీ బోర్డులో అంతర్జాతీయ నిపుణులు..

తెలంగాణ స్కిల్ యూనివర్సిటీని కేవలం రాష్ట్రస్థాయికే పరిమితం చేయకుండా అంతర్జాతీయ ఖ్యాతి గడించేలా తీర్చిదిద్దుతున్నామని మంత్రి వివేక్ పేర్కొన్నారు. యూనివర్సిటీ గవర్నింగ్ బోర్డులో గ్లోబల్ నిపుణులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేసి, విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా చెల్లుబాటయ్యే సర్టిఫికేషన్లను అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాజకీయ స్వార్థంతో చేస్తున్న తప్పుడు ప్రచారాలను పక్కనపెట్టి, విద్యార్థులు, లెక్చరర్లు వెంటనే తరగతులకు హాజరుకావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
 

©️ VIL Media Pvt Ltd.