
Vaibhav Sooryavanshi: ఇండియన్ క్రికెట్ సన్సేషన్, 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్, జింబాబ్వే పర్యటనల్లో మైండ్ బ్లాకింగ్ పర్ఫార్మెన్స్‌తో దుమ్మురేపాడు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ 3–0తో జింబాబ్వేను క్లీన్ స్వీప్ చేయడంలో వైభవ్ కీ రోల్ పోషించాడు. కేవలం మూడు టీ20 లలోనే రెండు హాఫ్ సెంచరీలతో ఏకంగా 151 పరుగులు బాది, మ్యాచ్ విన్నర్‌గా నిలవడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు.
ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా బిగ్ రెస్పాన్సిబిలిటీ:
ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ తన నెక్స్ట్ లెవెల్ ప్రయాణానికి సిద్ధమయ్యాడు. బీసీసీఐ (BCCI) ప్రకటించిన దులీప్ ట్రోఫీ 2026 షెడ్యూల్‌లో ఈ 15 ఏళ్ల కుర్రాడికి మంచి అవకాశం లభించింది. ఈస్ట్ జోన్ టీమ్‌కు వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్‌గా నియమిస్తూ బీసీసీఐ అనౌన్స్ చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఈస్ట్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, అతనికి డిప్యూటీగా వైభవ్‌కు ఈ బాధ్యతలు అప్పగించడం వైభవ్ పరిణతికి దక్కిన గౌరవంగా భావిస్తున్నారు. ఈ స్క్వాడ్‌లో మహమ్మద్ షమీ, అభిమాన్యు ఈశ్వరన్, ముకేష్ కుమార్, షాబాజ్ అహ్మద్, కుమార్ కుశాగ్ర లాంటి దిగ్గజ ప్లేయర్లు కూడా ఉండటం విశేషం.
రెడ్ బాల్ క్రికెట్‌లో అసలైన పరీక్ష:
వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే వైట్ బాల్ (T20) క్రికెట్‌లో సిక్సర్ల వర్షం కురిపించి తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాడు. అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ కాలం నిలదొక్కుకోవాలంటే రెడ్ బాల్ (ఫస్ట్ క్లాస్) క్రికెట్ చాలా కీలకం.. ఈస్ట్ జోన్ తరఫున దులీప్ ట్రోఫీలో ఆడటంతో క్రీజులో ఎక్కువ సమయం గడపడం, పిచ్ కండిషన్స్‌ను అర్థం చేసుకోవడం వంటి ఎన్నో విషయాలు వైభవ్‌కు అనుభవంగా మారనున్నాయి. 15 ఏళ్ల వయసులోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వైస్ కెప్టెన్సీ చేయడం అతనికి చాలా పెద్ద అడ్వాంటేజ్ కానుంది.
ALSO READ : సచిన్ కంటే కోహ్లీనే బెస్ట్ : డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఆగస్టు 23 నుంచి దులీప్ ట్రోఫీ రచ్చ స్టార్ట్:
ఈస్ట్ జోన్ తన తొలి మ్యాచ్‌ను నార్త్ ఈస్ట్ జోన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-2లో ఆగస్టు 23వ తేదీన ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సెమీఫైనల్స్ ఆగస్టు 30న, గ్రాండ్ ఫైనల్ సెప్టెంబర్ 6న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్నాయి. ప్రస్తుతానికి టీమిండియా బ్లూ జెర్సీలో చూడటానికి ఫ్యాన్స్ కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉన్నా, దులీప్ ట్రోఫీలో వైభవ్ కొట్టే సెంచరీల కోసం క్రికెట్ ప్రేమికులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
The ultimate zonal showdown is here! 🏏⚡
6️⃣ Teams. 5️⃣ Matches. 1️⃣ Champion. 🏆
Explore the full #DuleepTrophy fixture breakdown and lock in your dates starting 23rd August 🗓️ pic.twitter.com/h8fEMohIk1
— BCCI Domestic (@BCCIdomestic) August 20, 2026