
హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈడీ సోదాలు ముగిశాయి. హైదరాబాద్, కడప జిల్లాల్లో కీలక నిందితుల నివాసాల్లో ఈడీ తనిఖీలు చేసింది. ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో నగదును ఈడీ గుర్తించింది. 24 లక్షల రూపాయలు లెక్కల్లో చూపని నగదు ఉందని తేల్చింది. 24 లక్షల నగదుకు అవినాష్ రెడ్డి వివరాలు చెప్పలేదని ఈడీ అధికారులు తెలిపారు. ఈడీ అధికారులు నగదును సీజ్ చేశారు.
అవినాష్ రెడ్డికి చెందిన రెండు లాకర్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈడీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. హవాలా లావాదేవీలకు సంబంధించి ఈడీ ఆరా తీసింది. నగదు, లాకర్లు, డాక్యుమెంట్లపై ఈడీ అధికారులు మరింత లోతుగా పరిశీలన చేస్తున్నారు. సోదాల్లో లభించిన ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలకు ఈడీ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
►ALSO READ | ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడి రోడ్డు ప్రమాదం కేసులో FIR వివాదం