
రాకింగ్ స్టార్ యశ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్బింగ్ వెర్షన్స్‌లో రిలీజ్ కానుంది. ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత కేవీఎన్ మాట్లాడుతూ: ఈ సినిమాను చాలా పెద్ద విజన్‌తో, బోల్డ్ డ్రీమ్‌తో, చాలా బ్యూటిఫుల్‌గా నిర్మించాం. మేము ఎంత జాగ్రత్త తీసుకున్నామో ట్రైలర్‌లోని ప్రతి ఫ్రేమ్‌లో కనిపించి ఉంటుంది. ‘టాక్సిక్’ సినిమా ప్రేక్షకులకు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్, ఒక గ్రేట్ ఫీలింగ్ ఇస్తుంది. ఈ సినిమాను చూసే ప్రతి ఒక్కరికీ ఒక్కో రకమైన అనుభూతి కలుగుతుంది. యశ్ గారు ఇండియన్ సినిమాను గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై నిలబెట్టాలని నిరంతరం ప్రయత్నిస్తున్నారు. దర్శకురాలు గీతు గారు ప్రతి సన్నివేశంలో ఎమోషన్‌ను అద్భుతంగా పండించారు. ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డారు. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్ కుమార్ తదితరులు అందరూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. విశాల్ మిశ్రా, రవి బస్రూర్ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. దిల్ రాజు గారితో కొలాబరేషన్ ప్రతి సినిమాకీ ఒక బలం తీసుకొస్తుంది. మా సినిమా ప్రేక్షకులకు రీచ్ కావడానికి దిల్ రాజు గారి ద్వారా మాకు పర్ఫెక్ట్ ఛానల్ దొరికింది. సినిమాకు ఏం కావాలో వాళ్లు అన్నీ సమకూరుస్తున్నారు. ఈ వేడుక నిర్వహణకు మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్‌మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జనవరి 26న థియేటర్స్‌లో కలుద్దాం. ‘టాక్సిక్’ మిమ్మల్ని ఎంగేజ్ చేయడమే కాదు, ఎక్సైట్ చేయడమే కాదు.. మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.