Reading Time: < 1 minute

జూరాలకు పెరిగిన వరద ..10 గేట్లు ఓపెన్ .. కర్నాటక నుంచి మరింత వరద

Caption of Image.

గద్వాల, వెలుగు : జూరాల ప్రాజెక్ట్ కు ఎగువ నుంచి వరద రాక మరింత పెరిగింది. దీంతో జూరాల 10 గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కర్నాటక రాష్ట్రంలోని ప్రాజెక్ట్ ల నుంచి జూరాలకు 66 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో జూరాల వద్ద 5.182 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి, 10 గేట్ల ద్వారా 41,040 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్ట్ లోకి వదులుతున్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్తి ద్వారా 42,454 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 

 

©️ VIL Media Pvt Ltd.