
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టిన ప్రాజెక్టులలో నీటిని నిల్వ చేయలేమని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆదివారం (జులై 05) సెక్రటేరియట్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మంత్రి.. పదేళ్లపాటు ఇరిగేషన్‌శాఖను బీఆర్‌ఎస్ నాశనం చేసిందని విమర్శించారు.
తాము నిర్మించిన ప్రాజెక్టులలో నీటిని నిల్వచేయాలని బీఆర్ఎస్ అంటోందని.. కానీ అవి నీటిని నిల్వ చేసేందుకు పనికిరావని అన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులలో నీటిని నిల్వ చేస్తే ఏకంగా బ్యారేజీలే కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్నారు. ఆ బ్యారేజీలు కూలితో భద్రాచలంలో 44 గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదముందన్నారు. ఆ బ్యారేజీల బేస్ మెంట్లు పనికిరావని NDSA కూడా రిపోర్టు ఇచ్చినట్లు గుర్తు చేశారు.
►ALSO READ | అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. రోజూ రూ.8 లక్షలు దారి మళ్లాయా? సిట్ దర్యాప్తులో షాకింగ్ నిజాలు!
బీఆర్‌ఎస్ వాళ్లు దోచుకోడానికే ప్రాజెక్టులు కట్టారు.. బీఆర్‌ఎస్ ఏది ముట్టుకుంటే అది నాశనం అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేస్తే దాంట్లో కాళేశ్వరం తప్ప ఏం లేదన్నారు.
కన్నెపల్లి పంపు హౌస్ ఆన్ చేయాలని అడుగుతున్నారు.. ప్రాజెక్టులు సరిగ్గా కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు -మంత్రి ఉత్తమ్.