Reading Time: 2 minutes

భారత్పై ఇంగ్లాండ్ ఘన విజయం.. వరుస ఓటములతో ఇబ్బందుల్లో కెప్టెన్ శ్రేయస్

Caption of Image.

IND vs ENG 2nd T20I: మాంచెస్టర్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌లో 1–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత్ నిర్దేశించిన 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ ఆదిలోనే కుప్పకూలుతుందని భావించినా.. ఆ జట్టు మిడిల్ ఆర్డర్ పోరాటంతో పాయింట్ల పట్టికలో భారత్‌ను వెనక్కి నెట్టింది. టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ వరుసగా మూడో టీ20 మ్యాచ్‌లో ఓటమిని చవిచూడటం ఇప్పుడు ఫ్యాన్స్ ని నిరాశకు గురి చేస్తోంది.

అదరగొట్టిన అర్ష్‌దీప్.. బ్రూక్ విధ్వంసం: 
లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఆరంభం చాలా దారుణంగా ఉంది. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన మ్యాజిక్‌తో ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్‌లను వరుసగా డకౌట్ చేసి టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కానీ, క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హ్యారీ బ్రూక్ తన అసలు రూపం చూపించాడు. అర్ష్‌దీప్ వేసిన మూడో ఓవర్లో 4, 4, 6, 6, 6, 0  బాదుతూ ఏకంగా 27 పరుగులు పిండుకోవడంతో మ్యాచ్ మొమెంటం పూర్తిగా మారిపోయింది. బ్రూక్ (37)ను అక్షర్ పటేల్ పెవిలియన్ పంపినప్పటికీ.. ఇంగ్లాండ్ రన్‌రేట్ అప్పటికే పీక్స్‌కు చేరుకుంది.

జాకబ్ బెథెల్ ధనాధన్ ఇన్నింగ్స్: 
ఈ మ్యాచ్‌లో అసలైన టర్నింగ్ పాయింట్ 17వ ఓవర్. అప్పటి వరకు ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్‌ను జాకబ్ బెథెల్ ఒక్కసారిగా ఇంగ్లాండ్ వైపుకు తిప్పేశాడు. రవి బిష్ణోయ్ వేసిన ఆ ఓవర్లో వరుసగా నో-బాల్స్, సిక్సర్లు, ఫోర్లతో (1NB, 6, NB, 6, 2, 4, 6, 2) ఏకంగా 29 పరుగులు వచ్చాయి. ఈ భారీ ఓవర్ మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. జాకబ్ బెథెల్ 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఇంగ్లాండ్‌ను విజయతీరాలకు చేర్చాడు.

శ్రేయస్ అయ్యర్‌కు వరుస పరాజయాలు: 
భారత బ్యాటర్లు ఇషాన్ కిషన్ (49), అభిషేక్ శర్మ (43), శ్రేయస్ అయ్యర్ (37) రాణించడంతో 190 పరుగుల స్కోరు సాధించినా, బౌలర్లు దానిని కాపాడుకోవడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్ బౌలింగ్ లో టీమిండియా ధారళంగా పరుగులు సమర్పించుకుంది. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం జట్టు మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాల్‌గా మారింది. 

 

©️ VIL Media Pvt Ltd.