
Vaibhav Sooryavanshi: మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టులోకి 15 ఏళ్ల బేబి బాస్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. ఇక తన తొలి మ్యాచ్‌లోనే సంచలన ఇన్నింగ్స్‌తో అభిమానులను అలరించాడు. సంజు శాంసన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన వైభవ్, ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఒక అద్భుతమైన షాట్ తో అంతర్జాతీయ క్రికెట్‌లో తన మొదటి సిక్సర్‌ను నమోదు చేసుకున్నాడు.
148 Kmph వేగంతో బంతికి వైభవ్ కౌంటర్ ఎటాక్:
ఇంగ్లాండ్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ వేసిన ఒక ఓవర్లో ఈ అద్భుతం చోటు చేసుకుంది. ఆర్చర్ ఏకంగా 148 కిలోమీటర్ల వేగంతో (148 kmph) బ్యాక్-ఆఫ్-ది-లెంత్ డెలివరీని విసిరాడు. అంతటి వేగంతో దూసుకొచ్చిన బంతిని చూసి ఏమాత్రం భయపడకుండా.. ఈ 15 ఏళ్ల టీనేజర్ లెగ్ స్టంప్ వైపు కొద్దిగా జరిగి, ఒక మోకాలిపై కిందకు వంగి వికెట్ కీపర్ తల మీదుగా లేట్ స్కూప్ షాట్ ఆడాడు. బంతి నేరుగా బౌండరీ అవతలికి వెళ్లి సిక్సర్‌గా పడింది.
నెట్టింట వైరల్ అవుతున్న వీడియో:
ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకడైన జోఫ్రా ఆర్చర్‌ను ఎదుర్కొంటూ.. అదీ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే వైభవ్ సూర్యవంశీ ఆడిన ఈ Fearless షాట్‌ను చూసి మాంచెస్టర్ మైదానంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా లేచి నిలబడి చప్పట్లతో హోరెత్తించారు. ఈ క్లీన్ స్ట్రైక్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.
14 పరుగులకే వైభవ్ ఔట్:
ఇన్నింగ్స్ 4వ ఓవర్లో ఇంగ్లాండ్ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు వైభవ్ క్రీజ్ వదిలి ముందుకు వచ్చాడు. అయితే బంతిని అందుకోవడంలో విఫలం కావడంతో వికెట్ కీపర్ అతడిని స్టంప్ అవుట్ చేశాడు. వైభవ్ 10 బంతులు ఆడి 2 సిక్సులతో 14 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ, వన్-డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌లు భారత ఇన్నింగ్స్‌ను వేగంగా ముందుకు నడిపించే క్రమంలో.. అభిషేక్ కూడా 43 పరుగులు చేసిన తర్వాత సామ్ కరన్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. దీంతో 65 పరుగులకే టీమిండియా కీలకమైన రెండు వికెట్లని నష్టపోయింది.
Jacks 🤝 Jos
Sooryavanshi stumped ☝️
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/YH1X95fTHh
— England Cricket (@englandcricket) July 4, 2026
𝐒𝐈𝐗 < 𝐒𝐓𝐀𝐓𝐄𝐌𝐄𝐍𝐓 ⚡
Proof that #VaibhavSooryavanshi is built different. 🤯#ENGvIND 2nd T20I 👉 Streaming LIVE on JioHotstar! pic.twitter.com/Q5et8S5dXT
— Star Sports (@StarSportsIndia) July 4, 2026
𝘼𝙖𝙩𝙚 𝙝𝙞 𝙠𝙖𝙖𝙢 𝙨𝙝𝙪𝙧𝙪 𝙠𝙖𝙧 𝙙𝙞𝙮𝙚… 😅
Just the beginning, #VaibhavSooryavanshi smashes his FIRST INTERNATIONAL SIX FOR INDIA! 🙌#ENGvIND 2nd T20I 👉 Streaming LIVE on JioHotstar! pic.twitter.com/5Qa9iPRJ0x
— Star Sports (@StarSportsIndia) July 4, 2026