
- ఆఫీసర్లకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు: బండి సంజయ్
- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి రూ.10 లక్షల కోట్ల అప్పును ప్రజలపై మోపారు
- ఆర్థిక పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రం శ్రీలంక, పాకిస్తాన్‌లా మారే ప్రమాదం
- రేవంత్, కేసీఆర్ ఇద్దరూ కష్టపడి పైకొచ్చిన నాయకులేనని కామెంట్
- 20 ఏండ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న రేవంత్‌రెడ్డికి విషెస్ చెప్పిన సంజయ్
జగిత్యాల/కోరుట్ల, వెలుగు: మజ్లిస్‌తో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కైందని, హిందువుల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఇందులో భాగంగానే ఆఫీసర్లకు ప్రభుత్వం సహకరించడం లేదని, దీంతో అధికారులు హిందువుల ఇండ్లకు పూర్తిస్థాయిలో వెళ్లలేకపోతున్నారన్నారు. హిందువులంతా అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే తెలంగాణలో హిందువులే మైనార్టీలయ్యే ప్రమాదం వస్తుందని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి, భీమారం, కథలాపూర్ మండలాల్లో శనివారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం దేశాయిపేటలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కలిసి తెలంగాణ ప్రజలపై రూ.10 లక్షల కోట్ల అప్పు భారం మోపాయని విమర్శించారు.
బీఆర్ఎస్ పదేండ్లలో రూ.8.21 లక్షల కోట్లు, కాంగ్రెస్ రెండున్నరేళ్లలో రూ.1.77 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. ఇంత అప్పు చేసి నా అభివృద్ధి మాత్రం కనిపించడం లేదని, జీతాలు, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించేందుకు కూడా రాష్ట్ర ఖజా నాలో నిధులు లేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధుల తోనే జరుగుతున్నాయన్నారు. రెండు పార్టీల పాలనలో అప్పులు, అవినీతి, అక్రమాలే జరిగాయని ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొన సాగితే తెలంగాణ ఆర్థికంగా శ్రీలంక, పాకి స్తాన్ దేశాల మాదిరిగా మారే ప్రమాదం ఉందని అన్నారు.
రాష్ట్రంలో డబుల్ఇంజిన్ సర్కారు రావాలి..
అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని బయట పడేయాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందేనని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని సంజయ్ పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి గత ఏడేండ్లలో కేంద్రం నుంచి రూ.22 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చామని చెప్పారు. ఇందులో రోడ్ల నిర్మాణానికే రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని, నేషనల్ హైవేల విస్తరణ, సీఆర్ఐఎఫ్, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, జాతీయ ఉపాధి హామీ పథకాల ద్వారా గ్రామీణ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కష్టపడి క్షేత్రస్థాయి నుంచి ఎదిగిన నాయకుడినే సమాజం గౌరవి స్తుందని అన్నారు. 20 ఏండ్ల రాజకీయ జీవి తం పూర్తి చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ కూడా కష్టపడి పైకొచ్చిన నాయకుడేనని తెలిపారు.