Reading Time: < 1 minute
Nandamuri Mokshagna Boyapati Srinu Movie Nbk Films Debut Updates

Nandamuri Mokshagna Debut: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలయ్య నటవారసుడికి సంబంధించిన ఒక క్రేజీ వార్త ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్‌లో తెగ హల్చల్ చేస్తోంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న మోక్షజ్ఞ .. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయం బయటికి రావడంతో #Mokshagna, #NBKFilms, #BoyapatiSrinu అనే ట్యాగ్స్‌తో సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.

నిజానికి మోక్షజ్ఞ తన మొదటి సినిమాను ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ‘సినిమాటిక్ యూనివర్స్’ బ్యాక్‌డ్రాప్‌లో చేయాల్సి ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇదే సమయంలో మోక్షజ్ఞ వెండి తెర ఎంట్రీ కోసం బాలకృష్ణ పక్కా స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్యకు ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ లాంటి ఇండస్ట్రీ హిట్లను ఇచ్చిన బోయపాటి శ్రీను అయితేనే.. మోక్షజ్ఞను మాస్ ఆడియన్స్‌కు పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేయగలరని నందమూరి కాంపౌండ్ భావిస్తోందట. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాను లైన్‌లో పెట్టి దానిని బాలకృష్ణ తన సొంత నిర్మాణ సంస్థ ‘NBK ఫిలిమ్స్’ బ్యానర్‌పైనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నట్లు టాక్. మోక్షజ్ఞ కోసం ఇప్పటికే బోయపాటి శ్రీను ఒక పవర్‌ఫుల్ మాస్ స్క్రిప్ట్‌ రెడీ చేసి బాలయ్యను ఒప్పించారని, ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని జోరుగా ప్రచారం సాగుతుంది. ఒకవేళ ఈ కాంబినేషన్ అధికారికంగా ఖరారైతే గనుక బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట మొదలైనట్టే అని నందమూరి ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు. ఈ క్రేజీ అప్‌డేట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.