
బ్యాంక్ సెలవుల గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ముందే తెలుసుకోవడం వల్ల బ్యాంక్ లావాదేవీలను ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్ధిక లావాదేవీల్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందే జాగ్రత్త పడవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల క్యాలెండర్ ప్రకటిస్తూ ఉంటుంది. జాతీయ సెలవులే కాకుండా రాష్ట్రాల అధికారిక సెలవులు, స్థానిక పండుగల ఆధారంగా సెలవుల లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు ఈ సెలవుల షెడ్యూల్‌ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఈ క్యాలెండర్ ప్రకారం వచ్చే వారంలో బ్యాంక్ సెలవుల గురించి ఒకసారి తెలుసుకుందాం.మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బ్యాంకు శాఖకు వెళ్లాలని అనుకుంటుంటే.. ముందుగానే సెలవుల జాబితాను చూసుకోవాలి. దీని వల్ల మీ సమయం ఆదా అవుతుంది.
రెండు రోజులు బ్యాంకులు బంద్
భారతదేశవ్యాప్తంగా బ్యాంకులు ప్రతి ఆదివారం మూసి ఉంటాయి. జూలై 5న ఆదివారం సందర్భంగా బ్యాంకులు మూతపడనున్నాయి. MHIP దినోత్సవ వేడుకల కారణంగా మిజోరం రాజధాని ఐజ్వాల్‌లోని జూలై 6న బ్యాంకులు బంద్ అవుతాయి. మిజోరంలో ప్రతి సంవత్సరం MHIP దినోత్సవాన్ని పాటిస్తారు. ఈ సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి. ఇక జులై 11న రెండో శనివారం కారణంగా, ఇక జులై 12న ఆదివారం సందర్భంగా బ్యాంకులు మూతపడనున్నాయి.
సెలవు రోజుల్లో ఏ సేవలు ఉండవు ?
సెలవు రోజుల్లో బ్యాంకు కౌంటర్ల నుండి నగదు జమ చేయడం లేదా ఉపసంహరించుకోవడం కుదరదు. ఇక ముఖ్యమైన బ్యాంకింగ్ పనులు ఉన్నవారు తమ పనులను ముందు రోజే పూర్తి చేసుకోవాలి. అయితే బ్యాంక్ సెలవు రోజుల్లో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి.