Reading Time: < 1 minute
Ss Rajamouli Honored France Lumiere Institute Wall Of Filmmakers

Rajamouli Goes Global: తెలుగు సినిమా గ్లోబల్ స్థాయికి వెళ్ళిన తర్వాత మన దర్శకులకు అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు పెరుగుతోందా? తాజాగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళికి ఫ్రాన్స్ లో మరొక అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ లోని లూమియర్ ఇన్స్టిట్యూట్, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిని ప్రత్యేకంగా సత్కరించింది. అక్కడి ‘వాల్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్’ పై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు రాజమౌళి పేరు కూడా ఆ జాబితాలో చేరింది. ఈ ప్రోగ్రామ్ లో రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలను ప్రదర్శించారు. 2012 లో విడుదలైన ‘ఈగ’, చిన్న కాన్సెప్ట్ ను కొత్తగా చూపించిన సినిమాగా గుర్తింపు పొందింది.

ఇక ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా విడుదలై పలు అంతర్జాతీయ అవార్డులు అందుకోవడంతో పాటు, భారతీయ సినిమాపై విదేశీ ప్రేక్షకుల దృష్టిని మరింత ఆకర్షించింది. ఇటీవలే పారిస్ లోని ‘సినీమాథెక్ ఫ్రాంకైస్’ థియేటర్ లో రాజమౌళి పేరుతో శాశ్వత సీటును కేటాయించగా, ఇప్పుడు లూమియర్ ఇన్స్టిట్యూట్ జక్కన్న చిత్రాలతో ప్రత్యేక రెట్రోస్పెక్టివ్ ను నిర్వహిస్తుంది. ‘బాహుబలి’, ‘ఈగ’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి చిత్రాలను ప్రదర్శిస్తూ, భారతీయ సినిమాలపై అంతర్జాతీయ ప్రేక్షకుల్లో ఆసక్తి ఎలా పెరుగుతోందో ఈ కార్యక్రమం మరోసారి చూపిస్తుంది.