Reading Time: < 1 minute

PEDDI OTT: ‘పెద్ది’ ఓటీటీ రిలీజ్‌ డేట్ ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Caption of Image.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూన్ 4న థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. విడుదలైన తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం, ఈ ఏడాదిలోనే అతిపెద్ద భారతీయ బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

అయితే, సినిమాకు మిక్సెడ్ టాక్ వచ్చినప్పటికీ, రామ్ చరణ్ నటన, ఊరి గుర్తింపు కోసం చేసే పోరాటం సినిమాకు మంచి మైలేజ్ తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే థియేటర్లో సినిమా మిస్ అయిన ఆడియన్స్.. ఓటీటీ రిలీజ్‌ కోసం ఆసక్తిగా వెయిట్ చేశారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ డేట్ని అధికారికంగా ప్రకటించడంతో సినీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

‘పెద్ది’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

‘పెద్ది’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. జూలై 9 నుంచి ‘పెద్ది’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా “ఆట మారొచ్చు.. కానీ మొనగాడు మాత్రం మారడు” అంటూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా అందుబాటులోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. 

బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ జోరు..

సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, రామ్ చరణ్ ఊరమాస్ నటన, దర్శకుడు బుచ్చిబాబు సన టేకింగ్, అలాగే ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది. ఇక ఇప్పుడు ‘పెద్ది’ ఓటీటీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

©️ VIL Media Pvt Ltd.