
- ఇప్పటికే 18 పిల్లర్లకు ఫౌండేషన్ పూర్తి
- ప్రాజెక్టు వ్యయం రూ.1,487 కోట్లు
- ఫేజ్–2 జేబీఎస్ టు శామీర్‌పేట ప్రాజెక్టుకు రూ.4,263 కోట్లు
- పనుల తీరును వివరించేందుకు మీడియా టూర్ నిర్వహించిన ఆఫీసర్లు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎలివేటెడ్కారిడార్రెండు దశల పనులు వేగం పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా ప్యారడైజ్‌నుంచి బోయిన్పల్లి డెయిరీ ఫామ్ రోడ్‌వరకు 5.40 కి.మీ. పొడవున రూ.1,487 కోట్లతో నిర్మించే ఎలివేటెడ్కారిడార్–1 పనులు మరింత వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో రక్షణ శాఖ భూములు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద నుంచి సేకరించే భూములకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో పనులు జోరుగా సాగుతున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
పనుల తీరును వివరించేందుకు శనివారం మీడియా టూర్నిర్వహించారు. ఎస్ఈ హుస్సేన్, ఈఈ హరికృష్ణ ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. ప్యారడైజ్సమీప బాలం రాయి వద్ద ఫ్లైఓవర్ ప్రారంభమవుతుందని తెలిపారు. బాలం రాయి సర్కిల్‌వరకు 7 పియర్స్‌ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడి నుంచే అండర్ గ్రౌండ్టన్నెల్ పనులు జరుగుతాయని, మొత్తం 600 మీటర్ల పొడవున టన్నెల్నిర్మిస్తున్నట్లు చెప్పారు.
ఈ ఫ్లైఓవర్ పైనుంచి వెళ్లే ప్రయాణికులు టన్నెల్ గుండా తాడ్బండ్సర్కిల్ ముస్లిం గ్రేవ్‌యార్డు సమీపం వరకు ప్రయాణించాల్సి ఉంటుందన్నారు. తిరిగి అక్కడి నుంచి ఫ్లైఓవర్ప్రారంభమవుతుందని, బోయిన్పల్లి సర్కిల్ వద్ద జంక్షన్వస్తుందని, ఇక్కడ రెండు ర్యాంప్‌లను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్కడి నుంచి సుచిత్ర చౌరస్తా వరకు ఫ్లైఓవర్నిర్మాణం జరుగుతోందని, ఇది డెయిరీఫామ్రోడ్వద్ద ముగుస్తుందని తెలిపారు.
90 శాతం భూసేకరణ పూర్తి
రెండు ఎలివేటెడ్కారిడార్లకు సంబంధించి 90 శాతం భూసేకరణ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల చిన్న చిన్న సమస్యల వల్ల భూముల బదలాయింపు జరగలేదని, ఏ సమస్యా లేని ప్రాంతాల్లో మాత్రం ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు బోయిన్పల్లి ఎలివేటెడ్‌కు సంబంధించి 42.263 ఎకరాలు, శామీర్‌పేటకు సంబంధించి 123.324 ఎకరాలు.. మొత్తం 165.587 ఎకరాల భూ సేకరణకు అంగీకారం కుదిరిందన్నారు.
కాగా, బోయిన్పల్లి ప్రాజెక్టుకు 23.561 ఎకరాలు, శామీర్‌పేటకు సంబంధించి 68.229 ఎకరాల భూమిని ఇప్పటికే సేకరించినట్లు పేర్కొన్నారు. మిగతాది త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. రెండు ప్రాజెక్టులకు కలిపి 30 శాతం పనులకు అవసరమైన భూమి అందుబాటులో ఉందని తెలిపారు.
ఎలివేటెడ్ కారిడార్–2 ఇలా..ఎలివేటెడ్ కారిడార్–2ను ప్యారడైజ్జంక్షన్నుంచి శామీర్‌పేట ఓఆర్ఆర్వరకు నిర్మించనున్నారు. ప్రాజెక్టులో కొంత భాగం జేబీఎస్ నుంచి విక్రమ్‌పురి వరకు సబ్వేగా అండర్గ్రౌండ్ద్వారా రహదారి నిర్మిస్తారు. తర్వాత విక్రమ్‌పురి నుంచి ఎలివేటెడ్ఫ్లైఓవర్నిర్మిస్తారు. మొత్తం 18.14 కి.మీ. పొడువున నిర్మించే ఈ ప్రాజెక్టు వ్యయం రూ.4,263 కోట్లని అధికారులు తెలిపారు. ఇందులో ఎలివేటెడ్పొడవు 11.150 కి.మీ. కాగా టన్నెల్ పొడవు 0.450 కి.మీ. అని పేర్కొన్నారు.
హకీమ్‌పేట ఎయిర్ఫోర్స్వద్ద అండర్గ్రౌండ్టన్నెల్ నిర్మించనున్నామని చెప్పారు.ఈ ప్రాజెక్టులో మొత్తం డిఫెన్స్ల్యాండ్ 8.327 కి.మీ., ప్రైవేట్ భూములు 1.600 కి.మీ. మేర సేకరించామన్నారు. మొత్తం 19 చోట్ల జంక్షన్లు రానున్నాయని, కార్ఖానా, తిరుమలగిరి, అల్వాల్ వద్ద ర్యాంప్‌లు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.