
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్‌లోనూ సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం, జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
అక్కడ ఇప్పటివరకు ఈ చిత్రం ఏకంగా 2 మిలియన్ డాలర్ల (రూ.16 కోట్లకు పైగా) మార్కును దాటి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. టాలీవుడ్‌లో ఒక సోలో ఫీమేల్ లీడ్ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీనితో ఉత్తర అమెరికాలో ఈ ఘనత సాధించిన మొదటి తెలుగు హీరోయిన్‌గా సమంత సరికొత్త చరిత్ర సృష్టించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.90.15 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, అతి త్వరలోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టేందుకు దూసుకుపోతోంది. సమంత కెరీర్‌లోనే ఇదొక మైల్‌స్టోన్ హిట్‌గా నిలిచిపోనుందని సామ్ ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు.