Reading Time: 2 minutes

ఇది క్రికెట్టా.. అడల్ట్ షోనా?.. కండోమ్ యాడ్స్‌పై టీఎంసీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Caption of Image.

Condom Ads: మాంచెస్టర్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ కేవలం ఆట పరంగానే కాకుండా.. టీవీ స్క్రీన్లపై వచ్చిన ఒక ప్రకటన (యాడ్) కారణంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద వివాదానికి దారితీసింది. మ్యాచ్ ప్రసార సమయంల ఒక అడల్ట్ కంటెంట్ (డ్యూరెక్స్ కండోమ్ యాడ్) ఉన్న ప్రకటన రావడంపై భారత మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ కీర్తి ఆజాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. కోట్లాది మంది పిల్లలు, కుటుంబ సభ్యులు కలిసి చూసే మ్యాచ్‌లో ఇట్లాంటి యాడ్స్ వేయడం సిగ్గుచేట్టు అన్నారు. 

పిల్లలు అడిగితే ఏం సమాధానం చెప్పాలి: 
ఈ అంశంపై ఐఏఎఎన్ఎస్ (IANS) వార్తా సంస్థతో కీర్తి ఆజాద్ మాట్లాడుతూ తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇది పక్కా ఒక అడల్ట్ యాడ్.. మ్యాచ్‌లను చిన్న పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి ఇళ్లల్లో కూర్చొని చూస్తుంటారు.. వారి వయసు కనీసం 16 ఏళ్ల లోపే ఉంటుంది. నేను లైవ్ చూస్తున్నప్పుడే దాదాపు 44 కోట్ల మంది జనాలు ఈ మ్యాచ్ వీక్షిస్తున్నారు.. అంత పెద్ద నెట్‌వర్క్‌లో ఇట్లాంటి యాడ్ రావడం అస్సలు కరెక్ట్ కాదు.. ఇట్లాంటి ప్రకటనలతో ఇళ్లల్లో తల్లిదండ్రులు ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటారని, ఒకవేళ పిల్లలు దీని గురించి అడిగితే ఏం ఆన్సర్ చెప్పాలో తెలియక ఇబ్బంది పడతారని చెప్పుకొచ్చాడు. 

కండోమ్ యాడ్స్ ఎందురు ఆపలేరు:  
ఆల్కహాల్, సిగరెట్ ఉత్పత్తుల ప్రకటనలను టీవీల్లో, గ్రౌండ్లలో నిషేధించినప్పుడు.. మరి అడల్ట్ కంటెంట్ ఉన్న యాడ్స్‌ను ఎందుకు అనుమతిస్తున్నారని టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ BCCI (భారత క్రికెట్ నియంత్రణ మండలి)ని నిలదీశారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే సోషల్ మీడియా (X) వేదికగా ఈ వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ వెంటనే ఈ విషయాన్ని గమనించి యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశాడు.  

కండోమ్ యాడ్స్ పై పార్లమెంట్‌లో కొట్లాడుతా: 
ఈ సెన్సిటివ్ మ్యాటర్ మీద బీసీసీఐ గనుక సరైన రీతిలో స్పందించకపోతే.. ఊరికే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎంపీ కీర్తి ఆజాద్ హెచ్చరించారు. అవసరమైతే రాబోయే పార్లమెంటు సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించి, దేశవ్యాప్తంగా లైవ్ మ్యాచ్‌లలో ప్రసారమయ్యే అడల్ట్ యాడ్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ టాపిక్ క్రికెట్ సర్కిల్స్‌తో పాటు పొలిటికల్ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. 

©️ VIL Media Pvt Ltd.