
Tata Motors: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో టాటా ఆధిపత్యం కనబరుస్తోంది. మారుతిని వెనక్కి నెట్టి జూన్ నెల అమ్మకాల్లో ఎక్కువగా అమ్ముడైన వాటిలో తొలి రెండు టాటా కార్లే ఉన్నాయి. ముఖ్యంగా ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా మంచి పనితీరు కనబరిచింది. జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడైన కారుగా టాటా పంచ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఏకంగా ఈ కారు 21,006 యూనిట్లు అమ్ముడైంది. రెండో స్థానంలో టాటా నెక్సాన్ 18,335 యూనిట్లతో ఉంది. గత కొన్ని నెలలుగా ఎక్కువగా అమ్ముడైన కారుగా మారుతి సుజుకి డిజైర్ ఉంది. జూన్ నెలలో పంచ్ తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మారుతి సుజుకి డిజైర్ మూడో స్థానంలో నిలిచింది. డిజైర్ 17,899 యూనిట్లు అమ్ముడైంది. ఎర్టిగా అత్యధికంగా అమ్ముడైన నాలుగో కారుగా నిలిచింది. అదే సమయంలో మారుతి స్విఫ్ట్ 15,215 యూనిట్లు విక్రయించి ఐదో స్థానాన్ని దక్కించుకుంది. మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడైన కారుగా మహీంద్రా స్కార్పియో నిలిచింది. ఇది 14,097 యూనిట్లు విక్రయించబడింది. మారుతి సుజుకి బాలెనో 12,488 యూనిట్ల విక్రయాలతో తొమ్మిదో స్థానంలో ఉండగా, హ్యుందాయ్ వెన్యూ 10,776 యూనిట్లు అమ్ముడై పదో స్థానాన్ని దక్కించుకుంది. గతంలో తరచుగా టాప్-10లో కనిపించే హ్యుందాయ్ క్రెటా ఈసారి జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది.
Car Sales