
Thalapathy Vijay: తమిళనాడు సీఎం, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా ‘సిగ్మా’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని జూలై 31న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే ఇదే తేదీన స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా పరిచయమవుతున్న ‘DC’ ని విడుదల చేసేందుకు రెడీ అవుతుండటం ఇప్పుడు కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరంగా మారింది. లోకేష్ కనకరాజుకు విజయ్‌తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా, జాసన్ సంజయ్ సినిమాకు పోటీగా లోకేష్ సినిమాను తీసుకురావడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? లేక ఇది కేవలం యాదృచ్ఛికమా? అని కోలీవుడ్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ‘సిగ్మా’ సినిమాలో హీరోగా నటిస్తున్న సందీప్ కిషన్‌తోనే లోకేష్ కనకరాజ్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం గమనార్హం.
సీఎం విజయ్‌కి తన కుటుంబంతో విభేదాలు ఉన్నాయనేది కోలీవుడ్‌లో బహిరంగ రహస్యమే. త్రిషాతో ఆయనకున్న సాన్నిహిత్యం తన కుటుంబానికి దూరం చేసిందని, భార్య సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుమారుడు జాసన్ సంజయ్ సినిమాల విషయంలోనూ విజయ్ కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారని, అదే సమయంలో జాసన్ సంజయ్ తనదైన మార్గంలో దూసుకుపోతున్నారని సమాచారం. మరోవైపు, విజయ్ తన చిత్రం ‘జననాయగన్’ కోసం సిబిఎఫ్సిఏ సర్టిఫికేషన్ పూర్తి చేసుకున్నారు. కుమారుడి సినిమాకు తన సినిమా పోటీగా వస్తే, అభిమానుల ముందు తనకు నెగిటివ్ ఇమేజ్ వస్తుందని భావిస్తున్న విజయ్, తన సినిమాను ఒక వారం ముందుగానే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. ఇదే సమయంలో మరో కీలక అంశం ఏమిటంటే.. త్రిష రాజకీయ రంగప్రవేశంపై వస్తున్న ఊహాగానాలు. త్వరలో జరగబోయే తిరుచి ఉప ఎన్నికల్లో త్రిష పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నియోజక వర్గం నుంచి టీవీకే పార్టీ అభ్యర్థిగా లారెన్స్ పోటీ చేస్తారని ముందు ప్రచారం జరిగినప్పటికీ, తర్వాత ఆయన అఫీషియల్‌గా రేస్ నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు త్రిషకు లైన్ క్లియర్ అయిందని కోలీవుడ్ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. విజయ్ రాజకీయ ప్రయాణానికి మద్దతుగా త్రిష తిరుచి నుంచి బరిలోకి దిగుతున్నారా? లేక ఇది కేవలం ప్రచారం మాత్రమేనా? అనేది వేచి చూడాలి. మొత్తంగా దళపతి విజయ్ కుటుంబ వ్యవహారాలు, ఆయన కుమారుడి కెరీర్, త్రిష రాజకీయ ప్రవేశం – ఈ మూడు అంశాలు ప్రస్తుతం కోలీవుడ్ రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.