
పోలీస్ కొలువు సాధించాలనే పట్టుదలతో ఉన్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో భారీగా పోలీస్ ఉద్యోగాల భర్తీకి సర్కారు అనుమతినిచ్చింది. మొత్తం 7,437 పోస్టుల నియామకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆదివారం అధికారిక ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది. పోలీస్ శాఖతో పాటు ఫైర్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలు, ఏ ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
పోలీస్ శాఖ (మొత్తం ఖాళీలు: 5,000)
పోలీస్ శాఖలో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులు కలిపి 5000 ఖాళీల భర్తీకి ప్రభుత్వం జీవో నంబర్ 78 ద్వారా అనుమతి ఇచ్చింది.
- పోలీస్ కానిస్టేబుల్ (సివిల్): 3,697 పోస్టులు
- పోలీస్ కానిస్టేబుల్ (AR): 1,052 పోస్టులు
- సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్): 148 పోస్టులు
- అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (FPB): 23 పోస్టులు
- రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (AR): 14 పోస్టులు
- రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (TGSP): 12 పోస్టులు
- కానిస్టేబుల్ (డ్రైవర్ – PTO): 20 పోస్టులు
- కానిస్టేబుల్ (SARCPL): 24 పోస్టులు
- రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (SARCPL): 3 పోస్టులు
- కానిస్టేబుల్ (మెకానిక్ – PTO): 7 పోస్టులు
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ – SPF
జీవో నంబర్ 84 ద్వారా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో భారీగా ఉద్యోగాల భర్తీకి అనుమతి లభించింది.
- కానిస్టేబుల్: 1,380 పోస్టులు
- సబ్ ఇన్‌స్పెక్టర్: 44 పోస్టులు
ఫైర్ డిపార్ట్‌మెంట్ (మొత్తం ఖాళీలు: 790)
విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖలో జీవో నంబర్ 80 ప్రకారం నియామకాలు జరగనున్నాయి.
- ఫైర్ ఫైటర్స్: 751 పోస్టులు
- స్టేషన్ ఫైర్ ఆఫీసర్: 39 పోస్టులు
జైళ్ల శాఖ (మొత్తం ఖాళీలు: 223)
ప్రిజన్స్ – కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్‌లో జీవో నంబర్ 83 ప్రకారం క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
- వార్డర్ (పురుషులు): 196 పోస్టులు
- వార్డర్ (మహిళలు): 12 పోస్టులు
- డిప్యూటీ జైలర్ (పురుషులు): 14 పోస్టులు
- డిప్యూటీ జైలర్ (మహిళలు): 1 పోస్టు
నోటిఫికేషన్ ఎప్పుడు..?
హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయా విభాగాల అధిపతుల నుండి లోకల్ కేడర్ వారీగా పోస్టుల విభజన, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతల పూర్తి వివరాలు అందిన వెంటనే.. మరో కొన్ని రోజుల్లోనే అధికారిక రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లను జారీ చేయనున్నట్లు TSLPRB చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు ప్రెస్ నోట్ ద్వారా స్పష్టం చేశారు.
సుదీర్ఘ కాలంగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశం. మరికొద్ది రోజుల్లోనే దరఖాస్తు ప్రక్రియ, వయోపరిమితి సడలింపు, సిలబస్ వంటి పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ ప్రిపరేషన్, ఫిజికల్ ఈవెంట్స్ ట్రైనింగ్ సాధనను వేగవంతం చేసుకోవడం మంచిది.