Reading Time: < 1 minute

ఐశ్వర్య రాజేశ్ కొత్త వెబ్ సిరీస్ ఇసకపట్నం ఎలా ఉంది..? చూడొచ్చా..? టైం వేస్టా..?

Caption of Image.
  • టైటిల్: ఇసకపట్నం
  • డైరెక్షన్: గ్యారీ బీహెచ్​
  • కాస్ట్: ఐశ్వర్య రాజేశ్, సముద్రఖని, నరేశ్ అగస్త్య, సుధాకర్ కోమాకుల, రాజా
  • ప్లాట్​ఫాం: అమెజాన్​ ప్రైమ్ వీడియో

ఇసకపట్నం సముద్రంపై ఆధారపడి మత్స్యకారులు జీవించే ప్రాంతం. భార్యాబిడ్డలతో ఆ ఊరికి వచ్చిన నాయుడు (సముద్రఖని) ఆ పోర్టు ఏరియాలో తిరుగులేని నాయకుడిగా ఎదుగుతాడు.

అతని కూతురు భారతి (ఐశ్వర్య రాజేశ్) తమ కారు డ్రైవర్​ సూరి (సుధాకర్ కోమాకుల)తో ప్రేమలో ఉంటుంది. అదే ఊళ్లో ఆటో నడుపుకుని జీవిస్తున్న పెద్దన్న (నరేశ్ అగస్త్య)కి కార్పొరేటర్ కావాలని ఉంటుంది. రాజకీయాలకు, ముఠా తగాదాలకు దూరంగా అతను తన జీవితాన్ని కొనసాగిస్తుంటాడు.

ALSO READ : రావు బహదూర్ మూవీకి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌‌

ఇక నాయుడుతో పాటే ఉండే శేఖరం (రాజా) అతని కుర్చీలో కూర్చునే అవకాశం కోసం వెయిట్ చేస్తుంటాడు. ప్రతాప్ వర్మకి గల ఆర్థికబలం గురించి తెలిసిన నాయుడు, అతనికి తన కూతురు భారతిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ సిరీస్ ​స్టోరీ. ఈ వెబ్ సిరీస్ ఉత్కంఠగా సాగింది. కుటుంబం మొత్తం హ్యాపీగా చూసెయొచ్చు.

©️ VIL Media Pvt Ltd.