
కెరీర్ ప్రారంభంలో ఛైల్డ్ ఆర్టిస్టులుగా చేసిన చాలా మంది ఇప్పుడు స్టార్ హీరోలు, హీరోయిన్లుగా రాణిస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నారు. అయితే తాను మాత్రం డిఫరెంట్ అంటోంది రక్షణ. ఈ పేరు తెలుగు ఆడియెన్స్ కు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ తమిళ డబ్బింగ్ సినిమాలు చూసే వారికి ఈ అమ్మడు బాగా తెలిసే ఉంటుంది. 2011లో వచ్చిన సిరుత్తై సినిమాతో తెరంగేట్రం చేసింది రక్షణ. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ విక్రమార్కుడికి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీలో కార్తీ కూతురిగా నటించిందీ అమ్మాయి. మొదటి సినిమాలోనే తన క్యూట్ నెస్ తో అందరినీ కట్టి పడేసింది. దీని తర్వాత కూడా ఈ పాపకు వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తర్వాత మణిరత్నం, సముద్రఖని లాంటి స్టార్ డైరెక్టర్ల సినిమాల్లో నటించింది. అయితే వీటి తర్వాత సినిమాలేవీ చేయలేదీ అమ్మడు. చదువు, ఇతరత్రా కారణాలతో ఇండస్ట్రీకి దూరమైంది.
కాగా గతేడాది ఇంటర్ పూర్తి చేసింది రక్షణ. ఇప్పుడు కూడా సినిమాలకంటే చదువే ముఖ్యమంటోందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది రక్షణ. తన వ్యక్తిగత వివరాలన్నింటినీ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను కూడా అందులో పంచుకుంటోంది. నెటిజన్ల నుంచి కూడా ఈ అమ్మడి ఫొటోలకు లైకులు, షేర్ల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే తనకు సినిమా అవకాశాలు వస్తున్నా.. అందుకు తాను ఇప్పుడే సిద్ధంగా లేనంటోంది రక్షణ. ‘ ప్రస్తుతం నాకు సినిమా ఛాన్సులు వస్తున్నాయి. హీరోయిన్ గా చేయమని అడుగుతున్నారు. కానీ ఇప్పుడు నేను అందుకు సిద్ధంగా లేను. ప్రస్తుతం నా దృష్టంతా చదువు, క్లాసిక్ డ్యాన్స్‌ల మీదే ఏంది. కాస్త టైం తీసుకుని మంచి అవకాశం వచ్చాకే మళ్లీ కెమెరా ముందుకు వస్తాను’ అంటోంది రక్షణ. ఏదేమైనా ప్రస్తుతం నెట్టింట ఈ అమ్మడి ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
రక్షణ రీసెంట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.