
ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌తో బిజీగా ఉంది. ఐర్లాండ్‌పై రెండు టీ20ల సిరీస్ ఓడిపోయిన తర్వాత.. పటిష్టమైన ఇంగ్లాండ్‌పై గెలిచి పరువు నిలబెట్టుకోవాలని యంగ్ టీమిండియా తహతహలాడుతోంది. ఇప్పటికే తొలి టీ20 వర్షం కారణంగా రద్దు అయింది. ఇక ఈ రోజు (జూలై 4) రెండో టీ20 జరగనుంది. ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్, 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వయసు గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు.
వాళ్లిద్దరూ పరుగులు చేస్తున్నంత కాలం వారి వయసు గురించి చర్చ అనవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కెరీర్ చివరి దశకు వచ్చిన తర్వాత వయసు రిత్యా వారి ఫిట్‌నెస్, ఫామ్ వేగంగా పడిపోతుందని పేర్కొన్నారు. అలా చూస్తే వారి కెరీర్ ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం లేదని, దాని కోసం పెద్దగా చర్చ అవసరం లేదనే ఉద్దేశంతో కపిల్ దేవ్ మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలనే టార్గెట్‌తో ఉన్నారు. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతోందో చూడాలి.
ప్రస్తుతం అయితే ఈ నెల 14 నుంచి ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్ కోసం వారిద్దరూ రెడీ అవుతున్నారు. ఇప్పటికే అలీబాగ్‌లో విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాడు. రోహిత్ కూడా ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఇద్దరికీ ఇంగ్లాండ్‌లో మంచి రికార్డులు ఉన్నాయి. పైగా వారికి ఉన్న అనుభవంతో ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో కచ్చితంగా రాణిస్తారని క్రికెట్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి