Reading Time: < 1 minute

గచ్చిబౌలి కొండాపూర్ లో ఆక్రమణల తొలగిస్తున్న హైడ్రా… భారీగా ట్రాఫిక్ జామ్ 

Caption of Image.

హైదరాబాద్ లో చెరువులు,ప్రభుత్వ స్థలాల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పడ్డ హైడ్రా దూకుడు పెంచింది. ఆక్రమణలపై ఎప్పటికప్పుడు కొరడా ఝుళిపిస్తూ ప్రభుత్వ స్థలాలను కాపాడుతోంది హైడ్రా. ఈ క్రమంలో శనివారం ( జులై 4 ) హైదరాబాద్ లోని గచ్చిబౌలి, కొండాపూర్ లో ఆక్రమణల తొలగింపు చేపట్టింది హైడ్రా. ఈ క్రమంలో గచ్చిబౌలి,కొండాపూర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

సీఎంసీ సిబ్బందితో కలిసి హైడ్రా చేపట్టిన ఈ ఆపరేషన్ లో కొండాపూర్ బొటానికల్ గార్డెన్ నుండి మసీదు బండ వరకు రోడ్డుకు ఇరువైపుల వెలసిన ఆక్రమణలు తొలగించారు అధికారులు.

ఇవాళ ఉదయం 4 గంటల నుండే ఆక్రమణల తొలగింపు చేపట్టారు హైడ్రా, సీఎంసీ సిబ్బంది. భారీ బందోబస్తు మధ్య ఆక్రమణలు చేపట్టారు అధికారులు. 

©️ VIL Media Pvt Ltd.