
Babar Is Back: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఇయ్యాల (ఆదివారం, జులై 5న) ఒక పెద్ద అప్‌డేట్ ఇచ్చింది. రాబోయే వెస్టిండీస్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం పాకిస్థాన్ టెస్ట్ జట్టును ప్రకటించింది. అందరూ ఊహించినట్టే స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ మళ్లీ టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా తిరిగి ఎంపిక చేశారు. ఈ రెండు టూర్లలో పాక్ జట్టు కఠినమైన సవాళ్లను ఎదుర్కోవడానికి సరికొత్త ప్లేయర్లతో రెడీ అయిపోయింది. అయితే ఈ జట్టులో వైస్ కెప్టెన్సీ రేసులో ఉన్న సౌద్ షకీల్‌ను సెలెక్ట్ చేసినప్పటికీ.. ఇంగ్లాండ్ టూర్‌లో అతడు ఆడాలంటే మాత్రం ఫిట్‌నెస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సిందేనని పీసీబీ కండిషన్ పెట్టింది. ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అయితేనే షకీల్ ఇంగ్లాండ్ ఫ్లైట్ ఎక్కుతాడు.
ఎప్పుడెప్పుడు ఎక్కడ మ్యాచ్‌లు?:
వెస్టిండీస్ టూర్:
* మొదటి టెస్ట్: జూలై 25 నుంచి 29 వరకు
* రెండో టెస్ట్: ఆగస్టు 2 నుంచి 6 వరకు
ఇంగ్లాండ్ టూర్:
* మొదటి టెస్ట్: లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో ఆగస్టు 19 నుంచి మొదలు
* రెండో టెస్ట్: క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో ఆగస్టు 27 నుంచి స్టార్ట్
* మూడో టెస్ట్: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం
పాకిస్థాన్ ఫుల్ టెస్ట్ స్క్వాడ్:
బాబర్ అజామ్ (కెప్టెన్), ఆమిర్ జమాల్, అబ్దుల్లా ఫజల్, అలీ ఉస్మాన్, అజాన్ అవైస్, ఇమామ్-ఉల్-హక్, ఖుర్రమ్ షెహజాద్, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ అలీ, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ముహమ్మద్ అవైస్ జఫర్, ముహమ్మద్ గాజీ ఘోరి (వికెట్ కీపర్), సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ ఆఘా, సౌద్ షకీల్, షాన్ మసూద్, ఉబైద్ షా.