
హైదరాబాద్: గచ్చిబౌలి ఐఐఐటిలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్య, కుటుంబ సమస్యల కారణంగా బిల్డింగ్ 6వ అంతస్తూ నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన అనిరుధ్ (20) గచ్చిబౌలి ఐఐఐటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. గత కొంత కాలంగా అనారోగ్య, కుటుంబ సమస్యలతో సతమతమవుతోన్న అనిరుధ్ శనివారం (జూలై 4) తాను ఉంటున్న బిల్డింగ్ 6వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాలేజీ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనిరుధ్ మృతికి అనారోగ్య, కుటుంబ సమస్యలే కారణమా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు.