Reading Time: < 1 minute
Samantha To Host A New Tamil Talk Show On Sony Liv Buzz Grows Online

Samantha: వెండితెరపై తన నటనతో ఆకట్టుకున్న సమంత, ఓటీటీనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే ఆహా వేదికగా ప్రసారమైన ‘సామ్ జామ్’ టాక్ షోతో హోస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు మరో కొత్త టాక్ షోతో ప్రేక్షకులను అలరించనున్నారనే వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, సమంత ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ కోసం తమిళంలో ఓ కొత్త టాక్ షో చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన అతిథులతో ఈ షోను రూపొందించే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ వార్తలో మరో ప్రశ్న కూడా వినబడుతోంది. సమంత ప్రస్తుతం గర్భవతిగా ఉండటంతో ఈ టాక్ షో షూటింగ్‌ను ఆమె ప్రెగ్నెన్సీ సమయంలోప్రారంభిస్తారా? లేక ప్రసూతి సెలవు అనంతరం సెట్స్‌పైకి వస్తారా? అన్న విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. అసలు ఈ టాక్ షోపై సమంత, సోనీ లివ్ నుంచి గాని ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే ఇప్పటికే ‘సామ్ జామ్’ ద్వారా సెలబ్రిటీలతో సమంత హోస్టింగ్ కు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని మరో టాక్ షో ప్లాన్ చేస్తున్నారనే వార్త అయితే అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఆఫీషియల్ అనౌన్స్మెంట్ తరువాతే దీనిపై ఓ క్లారిటీ రానుంది.