
హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తున్న వలస కార్మికుల పిల్లల భవిష్యత్తుకోసం తెంగాణ ప్రభుత్వం వర్క్ సైట్ స్కూళ్లను రన్ చేస్తోంది. తొలుత నార్సింగిలోని పారిశ్రామిక ఏరియాలో వర్క్ సైట్ స్కూల్ ను ఏర్పాటు చేశారు. మరో రెండు స్కూళ్లను అదే ప్రాంతంలో ఏర్పాట్ చేయనున్నారు. ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే వలస కార్మికులకు ఇదొక వరంగా చెప్పొచ్చు.నిర్మాణ పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల పిల్లలు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు ఈ తరగతి గదిని ఏర్పాటు చేశారు.
శుక్రవారం నర్సింగిలో ఏర్పాటు చేసిన కార్మిక శిబిరంలో ఉన్న వర్క్ సైట్ స్కూల్ క్లాస్ లో 37 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. తమ చిన్న పలకలపై ఆంగ్ల అక్షరాలు రాస్తూ, కొత్త పదాలు నేర్చుకుంటూ ఉత్సాహంగా ఉన్నారు. టీచర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు పిల్లలు ఆసక్తిగా చేతులు ఎత్తుతున్నారు. అదే సమయంలో కొద్ది దూరంలో వారి తల్లిదండ్రులు భారీ భవనాల నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. రోజంతా కష్టపడి పనిచేసే కార్మికులకు తమ పిల్లల చదువు గురించి ఆందోళనను ఈ పాఠశాల తగ్గిస్తోంది.
రాష్ట్రంలో తొలి వర్క్ సైట్ స్కూల్ ను మే 3న నార్సింగిలో ఏర్పాటు చేశారు. రాజపుష్ప లేబర్ క్యాంపులో భారతదేశపు మొట్టమొదటి “వర్క్ సైట్ స్కూల్”ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ (సీఎంసీ) జి శ్రీజన ప్రారంభించారు.విద్యాశాఖ, పురపాలక శాఖ ,రాజపుష్ప ప్రాపర్టీస్ సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంతో జార్ఖండ్ , ఒడిశా ,ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికుల పిల్లలకు సురక్షితమైన విద్య అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ALSO READ : రైతులకు గుడ్ న్యూస్.. ఉల్లి కొనుగోలు ధరను పెంచిన కేంద్రం
వలస కార్మికుల కుటుంబాలు తరచూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారాల్సి రావడం వల్ల పిల్లల చదువుకు అంతరాయం ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ తరగతి గదులు వారికి విద్యతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా అందిస్తున్నాయి. చిన్నారులు చదువును కొనసాగించి మంచి భవిష్యత్తు సాధించేందుకు ఈ ప్రయత్నం ఎంతో ఉపయోగపడుతోంది. నగర అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంత ముఖ్యమో, వారి పిల్లల విద్య కూడా అంతే ముఖ్యమని ఈ కార్యక్రమం చాటి చెబుతోంది.