Reading Time: 2 minutes
Jr NTR: నా దగ్గరికి వచ్చి హీరో అవుతానంటే మొహం మీదే పొమ్మన్నా.. ఇప్పుడు స్టార్ అయిపోయాడు: జూనియర్ ఎన్టీఆర్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పిన్న వయసులోనే మాస్ హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు తారక్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అతనికి వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత దేవర, వార్ 2 సినిమాలతో ఫ్యాన్స్ ను మెప్పించిన ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు. కేజీఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది డ్రాగన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

సాధారణంగా అందరి హీరోలను గౌరవిస్తారు ఎన్టీఆర్. అలాగే యంగ్ హీరోలను కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. అలాంటిది ఓ సినిమా ఈవెంట్ లో తన బావమరిది, హీరో నార్నే నితిన్ గురించి జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘2011లో నాకు పెళ్లయ్యింది. అప్పుడు వీడు (నార్నే నితిన్) ఇంకా చాలా చిన్న పిల్లోడు. మాములుగా మాట్లాడడానికి కూడా భయపడేవోడు. నేను ఇంట్లోకి వస్తే భయపడి పోయేవాడు. నాతో మాట్లాడే వాడే కాదు. చివరకు నేనే ప్రయత్నించినా మాట్లాడే వాడే కాదు. అలాంటిది తను ధైర్యం తెచ్చుకుని మొదటి సారిగా నాతో చెప్పిన మాట ‘బావా.. నేను యాక్టర్ అవుతాను’ అని. నేను కూడా అంతే ధైర్యంగా.. ‘నా సపోర్టు నీకు ఉండదు.. పోయి చావు’ అన్నాను. నేను అలా చెప్పినా కానీ నితిన్ గురించి ఒక చిన్న భయం ఉండేది. ఇండస్ట్రీలో ఎలా ఉండగలుగుతాడు? కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటాడోనని ఆందోళన చెందేవాడిని. కానీ ఏరోజు కూడా తన సినిమాల గురించి కానీ, సీన్ల గురించి కానీ నాతో మాట్లాడలేదు. కానీ ఇప్పుడు స్టార్ అయిపోయాడు. అందుకు అతని దర్శకులు, నిర్మాతలే కారణం’ అని చెప్పుకొచ్చారు తారక్.

నార్నే నితిన్ తో ఎన్టీఆర్..

 

View this post on Instagram

 

A post shared by Narne Nithiin (@narnenithiin)

కొత్త సినిమా లాంఛ్ లో..

 

View this post on Instagram

 

A post shared by KVN Productions (@kvn.productions)

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.