Reading Time: < 1 minute

మనం తినే ఆహారంలో చిన్న మార్పులు చేసుకుంటే అటు పర్యావరణానికి, ఇటు మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. మనం రోజూ తినే మాంసం, డెయిరీ ఉత్పత్తుల పరిమాణాన్ని కాస్త తగ్గించి వాటి ప్లేస్‌లో కూరగాయలు బీన్స్ గుడ్లు లాంటివి చేర్చుకుంటే స్కాట్లాండ్ లాంటి దేశాలు తమ క్లైమేట్ లక్ష్యాలను ఈజీగా చేరుకోవచ్చని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల స్టడీలో తేలింది. ఖర్చు పెరగకుండానే అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ ఎలా పొందాలో చూద్దాం.

చిన్న మార్పు.. పెద్ద ఫలితం: మనం రోజూ తినే సాండ్‌విచ్‌లు లేదా పాస్తా వంటి వంటకాల్లో మాంసానికి బదులుగా కొద్ది మొత్తంలో వేరే ప్రత్యామ్నాయాలు వాడినా లాంగ్ రన్‌లో పర్యావరణానికి మనుషులకు చాలా మంచి జరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Change the Way You Eat: A Win for Health and the Planet
Change the Way You Eat: A Win for Health and the Planet

రోగాలకు చెక్.. పోషకాలకు ఢోకా లేదు: డైట్‌లో మాంసాహారాన్ని కొద్దిగా తగ్గించడం వల్ల టైప్-2 డయాబెటిస్ గుండె జబ్బులు వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.ఇక పైగా మాంసానికి బదులుగా ఇతర పౌష్టికాహారాలు తీసుకోవడం వల్ల బాడీకి అందే పోషకాలలో ఎలాంటి లోటూ ఉండదు.

డెయిరీ విషయంలో ఈ జాగ్రత్త ఓకే: పాల ఉత్పత్తులను తగ్గించడం వల్ల కొంతమందిలో అయోడిన్ లోపం వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెప్తున్నారు. అయితే ప్లాంట్ బేస్డ్ మిల్క్ ప్రొడక్ట్స్‌లో అయోడిన్‌ను ఫోర్టిఫై చేయడం ద్వారా ఈ సమస్యను చాలా ఈజీగా అధిగమించవచ్చు.

ఇక ఆరోగ్యకరమైన పర్యావరణానికి మేలు చేసే ఆహార పదార్థాలు ప్రజలకు సులువుగా తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తే..అటు ప్రజల ఆరోగ్యం ఇటు ప్రకృతి క్షేమం రెండూ సాధ్యమవుతాయి. ఇక ప్లేట్‌లో చేసే చిన్న మార్పే భూమిని కాపాడే పెద్ద అడుగు అవుతుంది.

గమనిక: మన డైట్‌లో ఏవైనా పెద్ద మార్పులు చేసేటప్పుడు లేదా పౌష్టికాహార లోపాలు రాకుండా చూసుకోవడానికి ఒకసారి న్యూట్రిషనిస్ట్ లేదా డాక్టర్ సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది.

The post తినే విధానం మార్చితే చాలు…హెల్త్‌కీ, ఎర్త్‌కీ డబుల్ బెనిఫిట్! appeared first on Manalokam – Latest Telugu News & Updates.