Reading Time: < 1 minute

రైతులకు గుడ్ న్యూస్.. ఉల్లి కొనుగోలు ధరను పెంచిన కేంద్రం 

Caption of Image.

ఉల్లి రైతుకు కేంద్రం గుడ్ న్యూస్​ చెప్పింది. బఫర్​ స్టాక్  కోసం  కొనుగోలు ధరను భారీగా పెంచింది.  క్వింటాల్​ కు రూ.1875 నుంచి రూ.2వేల 125 లకు పెంచింది. అంటే సుమారు 13 శాతం పెంచింది కేంద్రం. పెంచిన ధరలు ఈ రోజు(జూలై 4) నుంచే అమలులోకి వచ్చాయి. నాఫెడ్ (NAFED), ఎన్‌సిసిఎఫ్ (NCCF) ద్వారా ఉల్లిపాయల కొనుగోలు కొనసాగుతోంది. దీంతో రైతులకు మెరుగైన ధర లభించే అవకాశం ఉంది.

వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం 2025-26లో ఉల్లి ఉత్పత్తి 307.37 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేసింది. ఇది గత ఏడాదితో దాదాపు సమానమే. ప్రస్తుతం దేశంలో ఉల్లిపాయల కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో నిల్వలు కూడా తగినంతగా ఉన్నాయి.

ALSO READ : ఒకే ఒక్క రాత్రి వర్షానికి కుంగిపోయిన 12 వేల కోట్ల జాతీయ రహదారి..!

దేశవ్యాప్తంగా రోజుకు 50 వేల మెట్రిక్ టన్నులకుపైగా ఉల్లిపాయలు మార్కెట్లకు వస్తున్నాయి. సగటు చిల్లర ధర కిలోకు సుమారు రూ.31గా ఉంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాల ఆలస్యం కారణంగా వ్యాపారులు భవిష్యత్ ధరలు పెరుగుతాయనే అంచనాతో నిల్వలు కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వినియోగదారుల నుంచి పెద్దగా అదనపు డిమాండ్ లేదు. జూన్ నెలలో ఉల్లిపాయల ఎగుమతులు సాధారణంగానే కొనసాగినా, పాకిస్తాన్, చైనా నుంచి పోటీ పెరగడంతో రాబోయే రోజుల్లో ఎగుమతుల వేగం కొంత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు.
 ​ 

©️ VIL Media Pvt Ltd.