Reading Time: < 1 minute

రోస్టర్‌ లో జరిగిన అన్యాయం సరిదిద్దే వరకు మాలలతో కలిసి పోరాటం కొనసాగిస్తా: మంత్రి వివేక్ వెంకటస్వామి

Caption of Image.

హైదరాబాద్ లోని ఇందిరా పార్కులో హలో మాల ఛలో ఇందిరా పార్కు పేరుతో మహా ధర్నా నిర్వహించారు మాలలు. ఆదివారం ( జులై 5 ) జరిగిన ఈ ధర్నాకు మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. క్యాబినెట్ సబ్ కమిటీలో మాలల రిజర్వేషన్లపై జరిగిన అన్యాయాన్ని లెక్కలతో సహా వివరించామని.. శమీమ్ అక్తర్ కమిటీ నివేదికతో మాలలకు కేవలం 5శాతం రిజర్వేషన్ మాత్రమే దక్కిందని అన్నారు. రోస్టర్‌లో జరిగిన అన్యాయం సరిదిద్దే వరకు మాలలతో కలిసి పోరాటం కొనసాగిస్తానని అన్నారు మంత్రి వివేక్.

2011 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల ఆధారంగా చేసిన వర్గీకరణను మొదటి నుంచే వ్యతిరేకిస్తున్నానని…రోస్టర్ విధానంలో ఉన్న లోపాలను సీఎం, క్యాబినెట్ సమావేశాల్లో పలుమార్లు ప్రస్తావించానని అన్నారు. RTC నోటిఫికేషన్‌లో మాలలకు 5 శాతానికి బదులు కేవలం 2.8 శాతం మాత్రమే కేటాయించారని అన్నారు మంత్రి వివేక్.

ప్రభుత్వ నోటిఫికేషన్ల కారణంగా మాలలు 100కు పైగా ఉద్యోగాలను కోల్పోయారని… ఈ అంశంపై త్వరలోనే క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు.మాలలందరూ ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు మంత్రి వివేక్.

©️ VIL Media Pvt Ltd.