
కోట్లాది మంది ఆరాధించే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రతిరోజూ ఉదయం తొలిసారిగా దర్శించుకునే భాగ్యం ఎవరికి దక్కుతుంది? ఆ గౌరవం ఏ వీఐపీకో, ఉన్నతాధికారికో, ప్రధాన అర్చకుడికో కాదు… యాదవ వంశానికి చెందిన ఓ సామాన్య భక్తుడికి లభిస్తుంది. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సాంప్రదాయంలో భాగంగా, ఆయన్ను ‘సన్నిధి గొల్ల’ అని గౌరవంగా పిలుస్తారు. ప్రతిరోజూ తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో శ్రీవారి ఆలయ తలుపులు తెరుస్తారు. ఆలయ ప్రధాన అర్చకులు, పేష్కార్, జియ్యంగార్ స్వామి తమ దగ్గరున్న మూడు వేర్వేరు తాళాలతో గర్భగుడికి ముందుండే బంగారు వాకిలిని తెరుస్తారు. అయితే, వారెవరూ లోపలికి ప్రవేశించరు. వారి అనుమతితో మొదటగా ‘సన్నిధి గొల్ల’ గర్భగుడిలోకి అడుగుపెడతాడు. చిమ్మ చీకటిలో ఉన్న స్వామివారి ముందు ఆయన దీపం వెలిగిస్తాడు. ఆ తర్వాతే అర్చకులు లోపలికి వెళ్లి సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలుపుతారు. ఈ సాంప్రదాయం వెనుక బలమైన కారణం ఉంది. కలియుగంలో శ్రీవారు తిరుమల కొండపై వెలసినప్పుడు, ఆయన్ను తొలుత గుర్తించి సేవలు చేసింది ఓ యాదవ భక్తుడని పురాణాలు చెబుతున్నాయి. అతని నిష్కల్మష భక్తికి మెచ్చిన స్వామివారు… ప్రతిరోజూ తన తొలి దర్శనం చేసుకునే హక్కును అతని వంశీయులకు వరంగా ప్రసాదించారు. ఆ వరం కారణంగానే నేటికీ ఈ ఆచారం కొనసాగుతోంది. హోదా, అంతస్థులతో సంబంధం లేకుండా భక్తికే అగ్రపీఠం అని చాటిచెప్పే ఈ సాంప్రదాయం, తిరుమల క్షేత్రం యొక్క విశిష్టతను తెలియజేస్తుంది. సామాన్య భక్తుడికి లభించిన ఈ అపురూప గౌరవం, శ్రీవారికి భక్తుల పట్ల ఉన్న అపారమైన ప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గంటల తరబడి కూర్చునే డెస్క్ ఉద్యోగులకు హెచ్చరిక!
ఎక్కువ రోజులు ఆరోగ్యంగా బతకాలంటే.. అవి బలంగా ఉండాల్సిందే!
హోటళ్లలో 13వ నెంబర్ రూమ్, అంతస్తు ఎందుకు ఉండవు? అసలు రహస్యం ఇదే!