Reading Time: < 1 minute

రామయ్యకు సువర్ణ తులసీ దళార్చన..భద్రాచలం టెంపుల్ ప్రాకార మండపంలో సీతారాములకు నిత్య కల్యాణం

Caption of Image.

భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామికి శనివారం సువర్ణ తులసీదళాలతో గర్భగుడిలో మూలవరులకు అర్చన నిర్వహించారు. ప్రాకార మండపంలో సీతారాములకు నిత్య కల్యాణం నిర్వహించగా, భక్తులు కంకణాలు ధరించి క్రతువులో పాల్గొన్నారు. 

ఉగాది పండుగ సందర్భంగా కవి సామ్రాట్​ విశ్వనాథ సత్యనారాయణ రచించిన భద్రగిరి శతకం ఆడియో రికార్డును సీతారామచంద్రస్వామికి గరికపాటి రామమూర్తి సమర్పించారు. కార్యక్రమంలో ఏఈవో శ్రావణ్​కుమార్​ తదితరులు పాల్గొన్నారు. కాగా, భద్రాచలం అభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో కేవలం పడమర మెట్ల వైపు నుంచే భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించారు. 

©️ VIL Media Pvt Ltd.