
Rajat Patidar: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఓడిపోయాక.. మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియా (X) వేదికగా భారత జట్టు సెలెక్షన్‌పై మస్తు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిండు. వరుస ఓటములతో సతమతమవుతున్న టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో వైవిధ్యం (Variety) రావాలంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ రజత్ పాటిదార్‌ను వెంటనే తుది జట్టులోకి తీసుకోవాలని పఠాన్ గట్టిగనే డిమాండ్ చేశాడు.
పఠాన్ వేసిన ప్లాన్ ఇదే:
ఈ మ్యాచ్‌లో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేయడంతో.. భారత జట్టులో ఎడమచేతి వాటం (Left-hand) బ్యాటర్ల సంఖ్య ఏకంగా ఏడుకు చేరింది. ఇదే విషయంపై ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ప్రస్తుతం ఇండియన్ టీ20 మ్యాచులో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను చూస్తుంటే.. రాబోయే రోజుల్లో రజత్ వైపు చూడటానికి టీమిండియాకు ఇంతకంటే బలమైన కారణం ఇంకోటి అవసరం లేదు.. వచ్చే టీ20 వరల్డ్ కప్‌కు ఇంకా మస్తు టైం ఉంది కాబట్టి.. సెలెక్టర్లు రజత్ కి ఒక ఛాన్స్ ఇచ్చి ప్రయోగాలు చేయాలని పోస్ట్ పెట్టాడు. రైట్-లెఫ్ట్ కాంబినేషన్ సరిగ్గా ఉంటేనే ప్రత్యర్థి బౌలర్లను తిప్పలు పెట్టొచ్చని, పాటిదార్ లాంటి రైట్ హ్యాండర్ వస్తే టీంకు ప్లస్ అవుతుందని పఠాన్ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ రికార్డులతో పాటిదార్ ఆర్సీబీ ఊపు:
రజత్ పాటిదార్ ఆల్రెడీ భారత్ తరఫున 3 టెస్టులు, ఒక వన్డే ఆడినప్పటికీ, టీ20ల్లో మాత్రం ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026లో 14 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 501 రన్స్ చేసి.. 192.69 అసాధారణ స్ట్రైక్ రేట్‌తో ఆర్‌సీబీని వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ఓవరాల్‌గా టీ20ల్లో 106 ఇన్నింగ్స్‌ల్లో 3,389 రన్స్ చేసిన పాటిదార్ స్ట్రైక్ రేట్ (160.08) కూడా బాగుంది. ఇంత రికార్డు ఉన్నా గట్టి పోటీ వల్ల వాడు బెంచ్‌కే పరిమితం కావడం విశేషం.
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్:
యూకే (UK) పర్యటనకు ముందు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ నుంచి తీసేసి.. బీసీసీఐ (BCCI) మేనేజ్‌మెంట్ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్‌కు అప్పగించింది. కానీ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఐర్లాండ్ చేతిలో 2–0తో క్లీన్ స్వీప్ అయి ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. ఇక్కడ మొదటి మ్యాచ్ వానతో రద్దు కాగా, రెండో మ్యాచ్‌లో ఘోర ఓటమి ఎదురైంది.
Looking at the number of left-hand batters in the Indian T20 team right now, it’s even more of a reason for Team India to look at Rajat Patidar going forward.
I really hope he gets an opportunity, especially since there is still plenty of time for Team India to experiment before…
— Irfan Pathan (@IrfanPathan) July 4, 2026
INDIA MUST GIVE RAJAT PATIDAR A CHANCE – IRFAN PATHAN🤯
Irfan Pathan said :🗣️
“There are so many left handed batters in this Indian batting line up. When you have an IPL winning captain with two titles back to back for RCB & his batting form was stupendous as well. You should… pic.twitter.com/crVylts9cb
— Akshat (@Akshatgoel1408) July 5, 2026