Reading Time: 2 minutes

భారత పాస్‌పోర్ట్‌కు షాక్: 125వ స్థానానికి పడిపోయిన ర్యాంకింగ్.. ప్రపంచంలోనే పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్‌ ఎదో తెలుసా ?

Caption of Image.

ఈ ఏడాది (2026) విడుదలైన గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ (GPI) ర్యాంకింగ్స్‌లో మొత్తం 200 దేశాలకు భారతదేశం 125వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్ కేవలం మన దేశస్థులు ఎన్ని దేశాలకు ఫ్రీగా ప్రయాణించవచ్చు అనేదే కాకుండా.. ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి, అక్కడ ఉండడానికి  మన దేశ పాస్‌పోర్ట్ ఎంతవరకు ఉపయోగపడుతుందో కూడా చెప్తుంది.

సాధారణంగా వచ్చే పాస్‌పోర్ట్ ర్యాంకులు కేవలం ‘వీసా లేకుండా ఎన్ని దేశాలకు వెళ్ళచ్చు’ అనేదానిపైనే ఆధారపడతాయి. కానీ ‘గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్’ అనే సంస్థ ఇచ్చే ఈ గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇది మొత్తం స్కోరులో 50% ప్రయాణ సదుపాయానికి ఇస్తే, మిగిలిన 50% మార్కులను ఆ దేశంలో పెట్టుబడి అవకాశాలు (25%), అక్కడ లభించే జీవన నాణ్యత (25%) ఆధారంగా లెక్కిస్తుంది.

భారత్ పొజిషన్ ఏంటి?
ఈ నివేదిక ప్రకారం మన దేశానికి మిశ్రమ ఫలితాలు వచ్చాయి.మొత్తం ర్యాంక్ 125, 

ప్రయాణ సదుపాయం: ఇందులో మన స్థానం  135వ స్థానంలో ఉంది.

జీవన నాణ్యత: ఇందులో 118వ స్థానంలో నిలిచింది.

దీన్ని బట్టి చూస్తే, భారత్ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న, ప్రపంచవ్యాప్తంగా మన పాస్‌పోర్ట్‌కు రావాల్సిన ప్రయోజనాలు ఇంకా పూర్తిగా అందడం లేదని తెలుస్తోంది.

మరోవైపు, ప్రముఖ హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ (జూలై 2026) లో కూడా మన దేశ ర్యాంక్ పడిపోయింది. ఇందులో భారత్ 80వ స్థానానికి చేరింది. మన దేశ పాస్‌పోర్ట్ ఉన్నవారు కేవలం 56 దేశాలకు మాత్రమే వీసా లేకుండా లేదా ల్యాండ్ అయిన తర్వాత వీసా (వీసా-ఆన్-అరైవల్) తీసుకుని వెళ్ళవచ్చు. ఇవన్నీ కూడా ఎక్కువగా ఆసియా, ఆఫ్రికా, కరేబియన్, పసిఫిక్ దేశాలే. అమెరికా, బ్రిటన్, యూరప్ వంటి పెద్ద దేశాలకు వెళ్ళాలంటే భారతీయులకు  ముందే వీసా తప్పనిసరి ఉండాలి.

ఈ ర్యాంకులు ఎలా ఇస్తారు?
ఈ సంస్థ ప్రపంచ బ్యాంకు, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వంటి పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థల డేటాను పరిశీలించి, మొత్తం 14 ముఖ్యమైన అంశాల ఆధారంగా ఈ ర్యాంకులను డిసైడ్ చేస్తుంది.

ప్రపంచంలోనే టాప్ 10 పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్‌లు:
ఈసారి కూడా టాప్ 10 ర్యాంకుల్లో యూరప్ దేశాలదే హవా నడిచింది. మొదటి 10 స్థానాల్లో 9 యూరప్‌ దేశాలే ఉన్నాయి.

1. స్వీడన్ (ప్రపంచంలోనే నంబర్ 1)

2. స్విట్జర్లాండ్

3. ఫిన్లాండ్

4. జర్మనీ

5. డెన్మార్క్ (ఉమ్మడి 5వ స్థానం)

6. నెదర్లాండ్స్ (ఉమ్మడి 5వ స్థానం)

7. ఐర్లాండ్

8. యునైటెడ్ కింగ్‌డమ్ (బ్రిటన్)

9. నార్వే

10. సింగపూర్

స్వీడన్ ఎందుకు టాప్‌లో ఉందంటే:
ప్రయాణం, పెట్టుబడులు, జీవన నాణ్యత.. ఇలా అన్ని విభాగాల్లోనూ సూపర్ పర్ఫార్మెన్స్ చూపించి స్వీడన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా నిలిచింది. ఇక డెన్మార్క్, నెదర్లాండ్స్ రెండు దేశాలూ ఐదో స్థానంలో ఉన్న.. డెన్మార్క్‌లో జీవన ప్రమాణాలు బాగుంటే, నెదర్లాండ్స్‌లో పెట్టుబడి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.

 ప్రస్తుత రోజుల్లో పాస్‌పోర్ట్ అనేది కేవలం ఒక దేశం బోర్డర్ దాటడానికి మాత్రమే కాదు.. విదేశాల్లో సెటిల్ అవ్వడానికి, బిజినెస్ చేసుకోవడానికి, మంచి లైఫ్ స్టైల్ లభించడానికి అదొక పెద్ద గ్యారెంటీ కార్డులా మారిపోయింది.

©️ VIL Media Pvt Ltd.