Reading Time: < 1 minute
Gold Price Today: మళ్లీ అదే జోరు.. వారంలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు.. తాజా రేట్ల వివరాలు!

Gold, Silver Prices Today: బంగారం, వెండి ధరలు నిరంతరం కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ వారం బంగారం ధర రూ.6,000కు పైగా, వెండి ధర రూ.17,000కు పైగా పెరిగింది. MCXలో 10 గ్రాముల బంగారం ధర రూ.1.47 లక్షలకు, కిలో వెండి ధర రూ.2.40 లక్షలకుపైగా ఎగబాకింది. ఇప్పుడు బంగారం కొనడం తెలివైన పనా, లేక ధరలు తగ్గే వరకు వేచి ఉండాలా అన్నదే అతిపెద్ద ప్రశ్న.

తాజాగా జూలై 5వ తేదీన బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,730 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,500 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో ధర రూ.2,50,000 వద్ద ట్రేడవుతోంది.

ఈ రోజు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,46,880 ధరతో, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,34,650 ధరతో ఉంది. ఇక ముంబై, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్‌లలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,46,730 ధరకు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,34,450 ధరకు అమ్ముడవుతోంది. అదే సమయంలో, చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,49,460 ధరతో, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,37,000 ధరతో లభిస్తోంది.

ఒక వారంలో బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయి?

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం, ఈ వారం 24-క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,39,873 నుండి రూ.1,46,730కు పెరిగింది. ఇది సుమారుగా 6,857 పెరుగుదల. అదేవిధంగా, 22-క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,28,124 నుండి రూ.1,34,450కు పెరగగా, 18-క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,04,905 నుండి రూ.1,09,758కు పెరిగింది.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ర్యాలీ కొనసాగింది. జూలై 3 నాటి ట్రేడింగ్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1.30% పైగా పెరిగి 10 గ్రాములకు రూ.1,47,365కు చేరుకున్నాయి. సిల్వర్ ఫ్యూచర్స్ 1.62% పెరిగి కిలోకు రూ.2,37,499 వద్ద ముగిశాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి