Reading Time: < 1 minute
England Vs India 2nd T20i Jacob Bethell Ravi Bishnoi 29 Runs Over

భారత్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. భారత్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్‌లో బెథెల్ ఊచకోత కోస్తూ ఏకంగా 29 పరుగులు రాబట్టాడు.

బిష్ణోయ్ వేసిన నో-బాల్స్, ఫ్రీ-హిట్‌లను పూర్తిగా వాడుకున్న బెథెల్.. వరుస సిక్సర్లు, ఫోర్లతో భారత బౌలింగ్‌ను ముక్కలు చేశాడు. ఈ ఓవర్‌లో 3 సిక్సర్లు, 1 ఫోర్ బాదడంతో పాటు లక్ కలిసి వచ్చి రెండు నో-బాల్స్ లభించాయి. ఈ వీరవిహారంతో బెథెల్ కేవలం 43 బంతుల్లోనే 68 పరుగులు పూర్తి చేసుకుని మ్యాచ్‌ను ఇంగ్లాండ్ వైపు తిప్పేశాడు. బిష్ణోయ్ తన 4 ఓవర్ల కోటాలో వికెట్లేమీ తీయకుండా 60 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇలా అతడు వరుసగా నోబ్, 6, నో బాల్, 6, 2, 4, 6, 2 పరుగులు ఇచ్చాడు.

చివరికి సామ్ కర్రన్ (7), జోఫ్రా ఆర్చర్ వికెట్లు పడినా, బెథెల్ (45 బంతుల్లో 75 పరుగులు) క్రీజులో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఊచకోతతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. రెండో టీ20 లో ఇంగ్లాండ్ విజయం సాధించగా, భారత్ ఓటమి పాలైంది. ఈ ఘోర పరాజయంతో సిరీస్‌లో భారత్ వెనుకంజలో పడింది.